దసరా నాటికి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పనులు పూర్తి చేయాలి.లబ్ధిదారులకు త్వరలోనే సొంతింటి తాళాలు అందిస్తాం: మేయర్ మహంకాళి స్వామి.
రామగుండం: రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు రామగుండం నగరపాలక సంస్థ మేయర్ మహంకాళి స్వామి ఈరోజు ఉదయం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ పనులను లబ్ధిదారులతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా సంబంధిత కాంట్రాక్టర్లతో మాట్లాడిన మేయర్ , మిగిలిన పనులను త్వరితగతిన పూర్తి చేసి, లబ్ధిదారులకు ఇబ్బందులు లేకుండా ఇళ్లను అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.అనంతరం లబ్ధిదారులతో మేయర్ మహంకాళి స్వామి మాట్లాడుతూ.. రానున్న దసరా పండుగ నాటికి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పనులను పూర్తిస్థాయిలో పూర్తి చేయించి, అర్హులైన లబ్ధిదారులందరికీ ఇంటి తాళాలు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
లబ్ధిదారుల సొంతింటి కలను సాకారం చేయడంపై ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ప్రత్యేక దృష్టి సారించారని, పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు కాంట్రాక్టర్లు, సంబంధిత అధికారులతో మాట్లాడి పనులు వేగవంతం చేయాలని ఆదేశిస్తున్నారని మేయర్ తెలిపారు.“త్వరలోనే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులందరూ తమ నూతన సొంతింటిలోకి అడుగుపెట్టేలా చర్యలు తీసుకుంటాం. దసరా పండుగను సొంతింటి సంతోషంతో జరుపుకునేలా పనులను పూర్తి చేయడానికి కృషి చేస్తున్నాం” అని మేయర్ మహంకాళి స్వామి అన్నారు.ఈ కార్యక్రమంలో రామగుండం మునిసిపల్ కార్పోరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎండీ. ముస్తఫా, నాయకులు తిప్పారపు శ్రీనివాస్, కార్పొరేటర్లు వెంగల బాపు, గట్ల రమేష్, ధూళికట్ట సతీష్ తదితరులతో పాటు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులు పాల్గొన్నారు.

