Friday, October 9, 2026

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి పురస్కరించుకొని ఆదివారం రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం మొత్తం పోరాటాలు, త్యాగాల సమాహారం అని అన్నారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడిలో 1915 సెప్టెంబర్ 27న జన్మించిన బాపూజీ చిన్నతనం నుంచే అన్యాయాలపై తిరగబడ్డారని అన్నారు. భారత స్వాతంత్ర్య సంగ్రామంలో భాగంగా 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని ఆయన జైలుకు వెళ్లారని , ఆ తర్వాత తెలంగాణను పీడిస్తున్న నిజాం నవాబు క్రూర పాలనకు వ్యతిరేకంగా, రజాకార్ల అరాచకాలకు ఎదురొడ్డి సాయుధ పోరాటంలో చురుకైన పాత్ర పోషించారని అన్నారు. తొలిదశ , మలి దశ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి ఆయన తెలంగాణ రాష్ట్రం రాక ముందే మరణించడం దురదృష్టకరమని అన్నారు. వెనుకబడిన తరగతుల , దళిత, గిరిజన ప్రజల హక్కుల కోసం ఆయన నిరంతరం శ్రమించారని ముఖ్యంగా చేనేత కార్మికుల సంక్షేమం కోసం పద్మశాలీ సంఘాన్ని బలోపేతం చేసి, వారి ఆర్థికాభివృద్ధికి ఆప్కో సంస్థ స్థాపనలో కీలక పాత్ర పోషించారని అన్నారు. ఈ కార్యక్రమంలొ డిప్యూటీ మేయర్ పాతపెల్లి ఎల్లయ్య , నగర పాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకట స్వామి , కార్పొరేటర్లు వెంగళ బాపు , ముస్తాఫా , గట్ల రమేష్ , ధూళికట్ట సతీష్ , నాయకులు మారెల్లి రాజిరెడ్డి , రంజిత్ , అభిషేక్ ,పద్మశాలి సంఘం నాయకులు , ఆడెపు శంకర్ , బూర్ల దామోదర్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Most Popular