రామగుండం కార్పొరేషన్ కు ఆర్థిక నష్టాన్ని చేకూర్చే కొన్ని ఎజెండాలను రద్దు చేయాలని ప్రజావాణిలో ఫిర్యాదు
బిఆర్ఎస్ సిపిఐ ఫ్లోర్ లీడర్స్ మేకల సమ్మయ్య యాదవ్, మార్కపురి సూర్య
రామగుండం నగరపాలక సంస్థ సాధారణ కౌన్సిల్ సమావేశం మొన్న జరిగిన క్రమంలో అందులో తీసుకున్న కొన్ని ఎజెండాలు కార్పొరేషన్ నిధులకు ఆర్థికంగా నష్టం జరిగే అవకాశాలు ఉన్నందున నూతన మున్సిపల్ చట్టం 2019 సెక్షన్ 65 ను అనుసరించి జిల్లా కలెక్టర్ గారు కొన్ని ఎజెండాలను రద్దు చేయాలని ఈరోజు ప్రజావాణిలో కలెక్టరేట్ ఏవో బండి ప్రకాష్ గారికి బిఆర్ఎస్ సిపిఐ ఫ్లోర్ లీడర్స్ మేకల సమ్మయ్య యాదవ్, మార్కపురి సూర్య వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ”
ఎజెండాలో సద్దుల బతుకమ్మ పండుగ రోజున ఎల్ఈడి 120 వాట్స్ ఫ్లడ్ లైట్లఅద్దె ప్రతిపాదికన ఏర్పాటుకు 60 డివిజన్లకు గాను 22 లక్షల కేటాయించడం జరుగుతుంది కానీ ప్రస్తుతం ఉన్న ఆన్లైన్ మార్కెట్లో గాని మేకింగ్ ఇండియా ఫ్లాట్ ఫార్మ్స్ లో గాని చూస్తే 22 లక్షల్లో సొంతంగా కార్పొరేషన్ వారే లైట్లు కొనుగోలు చేయవచ్చు తద్వారా 5 ఏళ్లలో సుమారు 80 లక్షల రూపాయల ప్రజాధనాన్ని మదుపు చేసే అవకాశం ఉన్నది కావున ఇట్టి ఎజెండాను పరిశీలించి రద్దు చేయగలరు.
అర్బన్ చాలెంజ్ ఫండ్ కోసం డి పి ఆర్ తయారీ కోసం ప్రైవేట్ కన్సల్టెన్సీ లను ఆశ్రయిస్తున్నారు గతంలో కూడా ఇలాగే మన కార్పొరేషన్ వారు డిపిఆర్ సిద్ధం చేసిన అవి ఆమోదం పొందలేదు ఆ ప్రాజెక్టు రాకపోయినప్పటికీ సుమారు 26 లక్షల రూపాయలు మన కార్పొరేషన్ నిధులనుండి డిపిఆర్ తయారుచేసిన సంస్థకు చెల్లించడం జరిగింది ఇప్పుడు కూడా ఈ మూడు డీపిఆర్లు సంబంధించిన ప్రాజెక్టు వ్యాల్యూ సుమారు 375 కోట్లు అంటే డిపిఆర్ తయారుచేసిన వారికి సుమారు కోటి 80 లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది మన ఇంజనీరింగ్ అధికారులను ఉపయోగించి డిపిఆర్ తయారు చేయడం లేదా డిపిఆర్ ఆమోదం పొందితేనే కమిషన్ ఇచ్చే నిబంధనలతో ఈ ఎజెండాపై నిర్ణయం తీసుకోవాలని తమరికి విజ్ఞప్తి చేస్తున్నాను .ఈ ఎజెండాలో వనమహోత్సవం పేరిట 64 లక్షల కేటాయించడం జరిగింది వాస్తవానికి ఇప్పుడున్న కాలుష్యంలో ఇది చాలా అవసరం కానీ వర్షాకాలం పూర్తి కావస్తుంది అంతేకాకుండా గతంలో సింగరేణి నిధులు 35 లక్షలతో మున్సిపాలిటీ జంక్షన్ నుండి 5ఇన్క్ లైన్ వరకు నాటిన మొక్కలను పట్టించుకోకపోవడం మూలంగా చెట్లు పూర్తిగా ఎండిపోవడం జరిగింది కావున అట్టి 35 లక్షల నిధులపై విచారణ జరిపి రాబోయే వానకాలానికి ముందు ఈ వనమహోత్సవం చేయడం వల్ల కార్పొరేషన్ ప్రాంతానికి ఉపయోగకరంగా ఉంటుందని మేము భావిస్తున్నాం
ఈ ఎజెండాలో నగరపాలక సంస్థ పరిధిలోని వీధి దీపాల ఏర్పాటుకు పవర్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారితో అగ్రిమెంట్ చేసుకోవడం ద్వారా సుమారు 4.5 కోట్ల ప్రజాధనాన్ని వారికి ప్రతి సంవత్సరం చాల్సి ఉంటుంది అదే డబ్బుతో మన ఎలక్ట్రికల్ విభాగాన్ని మరింత పటిష్టంగా మార్చుకోవచ్చు కావున ఈ ఎజెండా వల్ల నగరపాలక సంస్థ నిధులకు నష్టం వాటిల్లడంతో పాటు స్థానిక ఎలక్ట్రిషన్లు ఉపాధి కోల్పోయే అవకాశం ఉన్నందున పరిశీలించి రద్దు చేయగలరని కోరుతున్నాను. నూతన మున్సిపల్ చట్టం 2019 సెక్షన్ 65ను అనుసరించి రామగుండం నగరపాలక సంస్థను ఆర్థికంగా నష్టాన్ని చేకూర్చే పై ఎజెండాలను రద్దు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు వారితోపాటు సిపిఐ నాయకులు శనిగరపు చంద్రశేఖర్, BRS నాయకులు తోకల రమేష్ ఉన్నారు

