Friday, October 9, 2026

మేడారం శ్రీ సమ్మక్క-సారలమ్మ “మినీ జాతర” తేదీలు ఖరారు

*మేడారం శ్రీ సమ్మక్క-సారలమ్మ “మినీ జాతర” తేదీలు ఖరారు

వరంగల్/ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మేడారంలో జరిగే శ్రీ సమ్మక్క-సారలమ్మ మినీ జాతర తేదీలు ఖరారయ్యాయి.

మేడారంలోని ‘పూజారుల (వడ్డెలు) సంఘం’ సభ్యులు మినీ జాతర నిర్వహణ తేదీలను అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు పంచాయతీరాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులకు లేఖ ద్వారా వివరాలను తెలియజేశారు.

మినీ జాతర తేదీల వివరాలు (2027):

17.02.2027 (బుధవారం)

* 18.02.2027 (గురువారం)

* 19.02.2027 (శుక్రవారం)

* 20.02.2027 (శనివారం)

పైన తెలిపిన నాలుగు రోజులు అమ్మవార్ల జాతర అమ్మవారి ఉత్సవాలు, పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. పూజారుల సంఘం నాయకులు మరియు వడ్డెలు ఈ వివరాలను దృవీకరిస్తూ లేఖపై సంతకాలు చేశారు.

Related Articles

Most Popular