రోడ్డు ప్రమాదంలో అంబులెన్స్ బోల్తా – పలువురికి గాయాలు
తేదీ 26-01-2026 న తెల్లవారుజామున 01:30 గంటల సమయంలో రోడ్డు ప్రమాదంలో గాయపడిన పవన్ అను వ్యక్తిని మంచిర్యాల నుండి MGM వరంగల్ తీసుకోని వెళ్తున్న అంబులెన్స్‌కు ఎదురుగా ఇద్దరు వ్యక్తులు ప్రయాణిస్తున్న Hero Glamour Blue Colour Bike No. TS 19 C 7580 ని అతివేగంగా, అజాగ్రత్తగా నడుపుకుంటూ వచ్చి ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అంబులెన్స్ అదుపుతప్పి బోల్తా పడింది. ఇట్టి ప్రమాదంలో అంబులెన్సు డ్రైవర్ సతీష్, అంబులెన్సులో వున్న పవన్, సుధీర్ & పవన్ తల్లి రమక్క, అక్క కవిత గాయపడినారు. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడే డ్యూటీలో ఉన్న A ఇంద్రసేనరెడ్డి ఇన్స్పెక్టర్ & సిబ్బంది గాయస్తులను అంబులెన్సు తెప్పించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినారు ప్రమాదానికి కారణమైన బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తులు మరియు వెనుక కూర్చున్న వ్యక్తి వివరాలు వారు మంచిర్యాల ప్రాంతానికి చెందిన SK. మహిమోద్దీన్ మరియు ఎండ్ పర్వేజ్ గా తెలిసింది. వారు కూడా గాయపడినారు అంబులెన్సు ఓనర్ అనంత్తుల వెంకటేశ్వర్లు దరఖాస్తు ఇచ్చినారు K రాజశేఖర్, S I కేసు నమోదు చేసినారు.

