**సెప్టెంబర్ 30లోగా డిజిటల్ పంటల సర్వే పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష**
**ప్రతి రైతు సాగు వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలి**
**డిజిటల్ పంటల సర్వే లేక ఏ ఒక్క రైతు కూడా సన్న రకం ధాన్యం బోనస్ కోల్పోకూడదు**
**రైతులతో సమన్వయంతో క్షేత్రస్థాయిలో సర్వేను పూర్తి చేయాలి**
**డిజిటల్ పంటల సర్వేపై అధికారులతో సమీక్షించిన జిల్లా కలెక్టర్**
—————————————
**పెద్దపల్లి, సెప్టెంబర్ 18:**
————————————-
ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాలో డిజిటల్ పంటల సర్వేను వేగవంతం చేసి, సెప్టెంబర్ 30లోగా పూర్తి చేయాలని *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష* సంబంధిత అధికారులను ఆదేశించారు.
శుక్రవారం సమీకృత జిల్లా కలెక్టరేట్లో పెద్దపల్లి నియోజకవర్గం లోని పెద్దపల్లి, సుల్తానాబాద్ , ఓదెల,కాల్వ శ్రీరాంపూర్, ఎలిగేడు, జూలపల్లి, మండలాల డిజిటల్ పంటల సర్వేపై సంబంధిత అధికారులతో మండల వ్యవసాయ విస్తరణ అధికారులు, మండల వ్యవసాయ అధికారులతో సమీక్షా *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష* సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో చేపడుతున్న డిజిటల్ పంటల సర్వే పురోగతి, రైతుల సాగు వివరాల ఆన్లైన్ నమోదు తదితర అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.. ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ,* ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా డిజిటల్ పంటల సర్వేను నిర్వహించాలని సూచించారు. ప్రతి రైతు సాగు చేస్తున్న పంట వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, తప్పనిసరిగా ఆన్లైన్లో నమోదు చేయాలని ఆదేశించారు. సర్వే ప్రక్రియలో ఎలాంటి జాప్యం లేకుండా సెప్టెంబర్ 30లోగా పూర్తిచేసేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు.సన్న రకం ధాన్యం సాగు చేస్తున్న రైతులకు ప్రభుత్వం అందించే బోనస్ పొందేందుకు డిజిటల్ పంటల సర్వే వివరాలు కీలకమని తెలిపారు. డిజిటల్ పంటల సర్వే పూర్తికాకపోవడం వల్ల సన్న రకం ధాన్యం సాగు చేస్తున్న ఏ ఒక్క రైతు కూడా బోనస్ కోల్పోకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి రైతుకు సంబంధించిన పంట వివరాలు సక్రమంగా నమోదు అయ్యేలా పర్యవేక్షించాలని సూచించారు.
క్షేత్రస్థాయిలో ఏఈఓలు, వ్యవసాయ అధికారులు రైతులతో సమన్వయం చేసుకుంటూ డిజిటల్ పంటల సర్వేను నిర్వహించాలని ఆదేశించారు. రైతుల నుంచి అవసరమైన వివరాలను సేకరించి, సర్వేను నిర్ణీత గడువులోగా పూర్తి చేసేలా సమన్వయంతో పనిచేయాలని సూచించారు.మండలాల వారీగా సర్వే పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని, ఎక్కడైనా జాప్యం ఉంటే వెంటనే గుర్తించి సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామాల్లో ఎంపిక చేయబడిన వాలంటీర్లను పర్యవేక్షిస్తూ,ప్రభుత్వ నిర్దేశిత గడువులోగా డిజిటల్ పంటల సర్వేను పూర్తిచేసి, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని స్పష్టం చేశారు.ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస్, మండల వ్యవసాయ అధికారులు,వ్యవసాయ విస్తరణ అధికారులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

