Thursday, June 4, 2026

29వ డివిజన్ అభివృద్ధియే నా ధ్యేయం: మున్సిపల్ ఎన్నికల బరిలో నిమ్మరాజుల రజిని రవి

 

MS8NEWS జనవరి 20 :లింగాపూర్ / హౌసింగ్ బోర్డ్ కాలనీ:రాబోయే మున్సిపల్ ఎన్నికలలో 29వ డివిజన్ (లింగాపూర్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, ఇందిరమ్మ కాలనీ) నుండి కౌన్సిలర్ అభ్యర్థిగా నిమ్మరాజుల రజిని రవి పోటీ చేయబోతున్నారు. ఈ సందర్భంగా వారు డివిజన్ ప్రజలను ఉద్దేశించి ఒక ప్రకటన విడుదల చేశారు.

​ప్రజల ఆశీర్వాదం కోరుతూ..”లింగాపూర్, హౌసింగ్ బోర్డ్ కాలనీ మరియు ఇందిరమ్మ కాలనీ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ డివిజన్ అభివృద్ధిలో భాగస్వామిని కావాలని, మీ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని నిర్ణయించుకున్నాను. ఈ మున్సిపల్ ఎన్నికల్లో మీ ముందుకు వస్తున్న నన్ను ఆదరించి, మీ అమూల్యమైన ఓటుతో ఆశీర్వదించాలని రెండు చేతులు జోడించి వేడుకుంటున్నాను.” అని రజిని రవి పేర్కొన్నారు.

​అభివృద్ధి ప్రణాళిక:​కాలనీల్లో మౌలిక సదుపాయాల మెరుగుదల.ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారం.పరిశుభ్రమైన మరియు ఆదర్శవంతమైన డివిజన్‌గా తీర్చిదిద్దడం.”మీ ఇంటి బిడ్డగా, మీ కష్టసుఖాల్లో తోడుండే వ్యక్తిగా నాకు ఒక్క అవకాశం ఇచ్చి గెలిపించాలని కోరుతున్నాను” అని వారు విజ్ఞప్తి చేశారు.

Related Articles

Most Popular