*1వ డివిజన్‌కు నూతన చెత్త సేకరణ ట్రాలీ ఏర్పాటు: అధికారులకు, మీడియా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపిన కార్పొరేటర్ మడిపల్లి విజయ మల్లేష్*
రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 1వ డివిజన్లో గత ఆరు నెలలుగా చెత్త సేకరించే ట్రాలీ పాడైపోయి రాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమస్యపై పత్రికల ద్వారా,సోషల్ మీడియా వేదికగా అడిషనల్ కలెక్టర్ రామగుండం కార్పొరేషన్ ఇంచార్జి కమిషనర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది.ఫిర్యాదుపై తక్షణమే స్పందించి,డివిజన్ ప్రజల ఇబ్బందులను తీరుస్తూ నూతన చెత్త సేకరణ ట్రాలీని సమకూర్చిన అడిషనల్ కలెక్టర్ మరియు మున్సిపల్ కమిషనర్ గారికి 1వ డివిజన్ ప్రజలందరి తరఫున కార్పొరేటర్ మడిపెల్లి విజయ మల్లేష్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.అలాగే డివిజన్ ప్రజల సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లడంలో,పరిష్కారం చూపడంలో తమవంతు పూర్తి సహకారం అందించిన ప్రింట్ మీడియా,ఎలక్ట్రానిక్ మీడియా మరియు సోషల్ మీడియా సోదరులందరికీ డివిజన్ ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ — “ప్రజా సమస్యపై స్పందించి కొత్త ట్రాలీని ఏర్పాటు చేసిన అధికారులకు,ఇందుకు సహకరించిన మీడియా సోదరులకు ధన్యవాదాలు.ఇకపై డివిజన్లో చెత్త సేకరణ ప్రక్రియ క్రమబద్ధంగా జరుగుతుంది.ప్రజలు కూడా పరిసరాల పరిశుభ్రతకు సహకరించి,చెత్తను వాహనంలోనే వేయాలని కోరుతున్నానని మడిపెల్లి విజయ మల్లేష్ తెలిపారు.

