సీసీఆర్బీ,సీసీఎస్, టాస్క్ఫోర్స్,ఐటీ కోర్,సైబర్ క్రైమ్ విభాగాల అధికారులు, సిబ్బందికి నగదు ప్రోత్సాహకాలు.అంకితభావంతో విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందిని అభినందించిన సీపీ అంబర్ కిషోర్ ఝా
రామగుండం సెప్టెంబర్ 17, (MS8 న్యూస్) తమకు అప్పగించిన విధులను అంకితభావం, నిబద్ధతతో నిర్వహిస్తూ ప్రతిభ కనబరిచిన సీసీఆర్బీ,సీసీఎస్, టాస్క్ఫోర్స్,ఐటీ కోర్,సైబర్ క్రైమ్ విభాగాల అధికారులు, సిబ్బందికి రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా నగదు ప్రోత్సాహకాలను అందజేశారు.
నేరాల నియంత్రణ,నేరస్తుల గుర్తింపు, సైబర్ నేరాల అరికట్టడం,సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించడం,ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించడం వంటి అంశాల్లో విశేష కృషి చేసిన అధికారులు,సిబ్బందిని ఈ సందర్భంగా సీపీ అభినందించారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ,పోలీసు శాఖలోని వివిధ విభాగాలు సమన్వయంతో పనిచేయడం ద్వారా,నేరాలను మరింత సమర్థవంతంగా నియంత్రించడంతో పాటు,నేరాల దర్యాప్తులో వేగం,నాణ్యత పెరుగుతాయని తెలిపారు.
సీసీఆర్బీ ఇన్స్పెక్టర్ అనిల్ ఆధ్వర్యంలో,సీసీఎస్ ఏసీపీలు రవీందర్,ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో, టాస్క్ఫోర్స్ ఏసీపీ శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో,ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో,సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆయా విభాగాలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ తమ విధుల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు.
సైబర్ నేరాల నియంత్రణలో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించడం, బాధితులకు సత్వర సహాయం అందించడం, నేరాలకు సంబంధించిన సమాచారాన్ని విశ్లేషించడం, నేరస్తులను గుర్తించడం వంటి అంశాల్లో అధికారులు,సిబ్బంది చేస్తున్న కృషిని సీపీ ప్రశంసించారు.
అదేవిధంగా,నేర నియంత్రణ,అక్రమ కార్యకలాపాలపై నిఘా,నేరస్తుల కదలికలను గుర్తించడం,కేసుల దర్యాప్తునకు అవసరమైన సమాచారాన్ని సేకరించడం వంటి అంశాల్లో టాస్క్ఫోర్స్,సీసీఎస్ అధికారులు,సిబ్బంది సమన్వయంతో చేస్తున్న కృషిని అభినందించారు.
ప్రతి పోలీసు అధికారి,సిబ్బంది తమకు అప్పగించిన బాధ్యతలను నిబద్ధత,క్రమశిక్షణ, సమయస్ఫూర్తితో నిర్వహించాలని సీపీ సూచించారు.విధుల్లో ప్రతిభ కనబరిచే సిబ్బందిని గుర్తించి ప్రోత్సహించడం ద్వారా,ఇతర సిబ్బందిలో కూడా మరింత ఉత్సాహం,బాధ్యతాభావం పెరుగుతుందని తెలిపారు.
భవిష్యత్తులో కూడా ఇదే అంకితభావంతో విధులు నిర్వహిస్తూ రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ,నేర నియంత్రణకు మరింత కృషి చేయాలని సీపీ సూచించారు.

