వర్షంలోనూ నిమజ్జన ఏర్పాట్లను పర్యవేక్షించిన రామగుండం సీపీ
వినాయక నిమజ్జనోత్సవం సందర్భంగా, గోదావరిఖని గోదావరి నది వంతెన వద్ద చేపట్టిన నిమజ్జన ఏర్పాట్లను రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, ఐపీఎస్.,క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు.
వర్షం కురుస్తున్న సమయంలో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష,అదనపు కలెక్టర్ అరుణ శ్రీ, గోదావరిఖని ఏసీపీ రమేష్ తదితర అధికారులతో కలిసి, నిమజ్జన ప్రాంతాన్ని సందర్శించిన సీపీ, నిమజ్జన ప్రక్రియ, బందోబస్తు ఏర్పాట్లు, భద్రతా చర్యలను పరిశీలించారు.
ఈ సందర్భంగా వర్షాల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని,భద్రతా చర్యలను మరింత పటిష్టంగా అమలు చేయాలని పోలీస్ అధికారులు,సిబ్బందికి సూచించారు.నిమజ్జన ప్రక్రియ పూర్తయ్యే వరకు విధుల్లో ఉన్న ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేస్తూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
భక్తులు,నిర్వాహకులు కూడా పోలీసుల సూచనలను పాటిస్తూ నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు సహకరించాలని సీపీ కోరారు.

