Thursday, June 4, 2026

రామగుండం బల్దియా సమరం: 43వ డివిజన్ బిఆర్ఎస్ అభ్యర్థిగా రాముల కార్తీక్?

 

MS8NEWS జనవరి 18 గోదావరిఖని (రామగుండం):తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో రామగుండం కార్పొరేషన్‌లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. తాజాగా రామగుండం కార్పొరేషన్ 43వ డివిజన్ నుండి బిఆర్ఎస్ పార్టీ తరపున యువ నేత రాముల కార్తీక్  ఎన్నికల బరిలో నిలువనున్నారు.

​ఇటీవలే పార్టీ ముఖ్య నాయకులను కలిసి ఆశీస్సులు తీసుకున్న కార్తీక్, డివిజన్ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని ప్రకటించారు. ముఖ్యంగా రామగుండం కార్పొరేషన్ పరిధిలోని స్థానిక సమస్యలు, తాగునీరు, డ్రైనేజీ మరియు కనీస మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు.

​యువ నాయకత్వం వైపు మొగ్గు?

​రామగుండం ఇండస్ట్రియల్ బెల్ట్‌లో యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని బిఆర్ఎస్ భావిస్తోంది. అందులో భాగంగానే చురుకైన కార్యకర్తగా పేరున్న కార్తీక్‌కు అవకాశం ఇవ్వనునట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. 43వ డివిజన్ లో ఇప్పటికే ఇంటింటికీ తిరుగుతూ ప్రజల మద్దతు కోరుతున్న రాముల కార్తీక్.

 

Related Articles

Most Popular