Wednesday, October 28, 2026

ప్రజావాణి లో అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలి:: జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష

ప్రజావాణి లో అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలి:: జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్

 

అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలని, ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి అర్జీలను పెండింగ్ లో ఉంచకుండా పరిష్కరించాలని *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష* సంబంధిత అధికారులను ఆదేశించారు.

 

సోమవారం *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ,అదనపు కలెక్టర్ శ్రీరాములు* తో కలిసి కలెక్టరేట్ సమావేశం మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు.రామగుండం మండలం గోదావరిఖని సిక్కు వాడకు చెందిన మేదరి లలిత తన కూతురు మేదరి సౌజన్య తన పేరు మీద ఉన్న ఇల్లును రిజిస్ట్రేషన్ చేసుకొని తమ బాగోగులు చూసుకోకుండా ఇంటి నుంచి వెళ్లిపోవాలని వేధింపులకు గురి చేస్తున్నారని, దరఖాస్తు చేసుకోగా ఆర్డిఓ పెద్దపల్లి కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు.పెద్దపల్లి మండలం గుర్రంపల్లి గ్రామానికి చెందిన పైడిపండ్ల తిరుపతమ్మ గృహ జ్యోతి పథకంలో 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సబ్సిడీ అమలు కోసం దరఖాస్తు చేసుకోగా ఎంపీడీవో పెద్దపల్లి కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు.కమాన్ పూర్ మండలానికి చెందిన చాట్ల అనూష తాము నిరుపేద కుటుంబానికి చెందిన వారమని తమకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు తీసుకోగా పీడీ హౌసింగ్ కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. మంథని మండలం బిట్టుపల్లి గ్రామానికి చెందిన జె.కృష్ణయ్య గ్రామ శివారులోని సర్వేనెంబర్ 56 లో గల భూమి సాదా బైనామ అమలు గురించి కోరుతూ దరఖాస్తు చేసుకోగా తహసిల్దార్ మంథనికి రాస్తూ విచారణ చేసి అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజావాణి కార్యక్రమంలో సంబంధిత జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Most Popular