Wednesday, July 29, 2026

తెలంగాణ ఉద్యమకారురాలు అనుముల కళావతిని పరామర్శించిన వ్యాల హరీష్ రెడ్డి.

(MS8NEWS జనవరి 9):​గోదావరిఖని, రామగుండం:తెలంగాణ మలిదశ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న రామగుండం నియోజకవర్గం, గోదావరిఖని పట్టణానికి చెందిన ప్రముఖ ఉద్యమకారురాలు అనుముల కళావతి గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న వ్యాల హరీష్ రెడ్డి ఈరోజు వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు. కళావతి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, వారికి అందుతున్న వైద్య చికిత్స గురించి కుటుంబ సభ్యులతో చర్చించారు. “తెలంగాణ కోసం పోరాడిన వీరవనిత మీరు, త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తారు” అని ఆమెకు మనోధైర్యాన్ని కల్పించారు.ఏ అవసరం వచ్చినా అండగా ఉంటామని ఈ సందర్భంగా హరీష్ రెడ్డి హామీ ఇచ్చారు.తెలంగాణ ఉద్యమ సమయంలో కళావతి చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు పలువురు స్థానిక నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Articles

Most Popular