Thursday, October 29, 2026

తక్కలపల్లిలో సమ్మక్క–సారలమ్మ గద్దెల నిర్మాణ పనుల పరిశీలన ​పనులను వేగవంతం చేయాలని అధికారులకు ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ ఆదేశం

​MS8NEWS రామగుండం, జనవరి 21:రామగుండం నియోజకవర్గ పరిధిలోని తక్కలపల్లి గ్రామంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమ్మక్క–సారలమ్మ గద్దెల నిర్మాణ పనులను స్థానిక శాసనసభ్యులు శ్రీ ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ బుధవారం అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

​క్షేత్రస్థాయి పరిశీలన గద్దెల నిర్మాణ పురోగతిని, వినియోగిస్తున్న సామగ్రి నాణ్యతను ఎమ్మెల్యే ఈ సందర్భంగా తనిఖీ చేశారు. రాబోయే జాతర నాటికి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలతో ఈ నిర్మాణాలను పూర్తి చేయాలని ఆయన అధికారులకు సూచించారు.

​గడువులోగా పూర్తి: నిర్మాణ పనుల్లో జాప్యం వహించకుండా, నిర్దేశిత గడువులోగా పనులన్నీ పూర్తి చేయాలి. నిర్మాణంలో ఎక్కడా రాజీ పడకుండా నాణ్యతా ప్రమాణాలను పాటించాలి.జాతర సమయానికి భక్తులకు అవసరమైన మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని సంబంధిత శాఖాధికారులను ఆదేశించారు.

​ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, వివిధ శాఖల అధికారులు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.

Related Articles

Most Popular