Wednesday, October 28, 2026

ఇది కాంట్రాక్టర్ల జేబులు నింపే ఏజండా…41డివిజన్ లో సి సి రోడ్డు, మహిళా భవన్ నిర్మించండి : సిపిఐ ఫ్లోర్ లీడర్ మార్కపురి సూర్య 

ఇది కాంట్రాక్టర్ల జేబులు నింపే ఏజండా…41డివిజన్ లో సి సి రోడ్డు, మహిళా భవన్ నిర్మించండి : సిపిఐ ఫ్లోర్ లీడర్ మార్కపురి సూర్య

రామగుండం రెండవ సాధారణ సమావేశంలో 41వ డివిజన్ అభివృద్ధికి సంబంధించిన విషయాల పైన సిపిఐ ఫోర్ లీడర్ మార్కపురి సూర్య సూర్య మాట్లాడటం జరిగింది. గతంలోని 41 డివిజన్లో సీసీ రోడ్లో నిర్మించాలని ప్రధాననాల అనేక చోట్ల డామేజ్ కావడం వల్ల ప్రజలకు తీవ్రత దుర్వాసనతో ఇబ్బందులకు గురవుతున్న కారణంగా ప్రధాన నాల సర్వే చేయించి ప్యాచ్ వర్క్ రిపేర్ చేయాలని కోరారు. 41వ డివిజన్లో ఖాళీ స్థలం 10 గుంటలు ఉన్నందున మహిళా భవన్ నిర్మించాలని కోరారు. అలాగే ఈ ఏజెండా కాంట్రాక్టర్ల జేబులు నింపే ఎజెండా తప్ప ప్రజల కోరిగేది ఏమీ లేదని వారు ధ్వజమెత్తారు. ఈరోజు వన మహోత్సవం పేరిట 64 లక్షల రూపాయలు కేటాయించే ఎజెండాను తాను వ్యతిరేకిస్తున్నానని గతంలో పట్టణ ప్రణాళిక నిధుల నుండి 35 లక్షల రూపాయలు కేటాయించి ఈరోజు చెట్లు మధ్యలో పూర్తిగా ఎండిపోయిన సందర్భంలో మరోసారి 64 లక్షల కేటాయించాల్సిన అవసరం లేదని దుర్వినియోగం జరిగిన 35 లక్షల పై విజిలెన్స్ విచారణ జరిపిన అనంతరమే ఏజెండా ముందుకు తీసుకురావాలని డిమాండ్ చేశారు.

అలాగే సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా లైట్లు ఏర్పాటు చేయడానికి 22 లక్షల రూపాయలను కేటాయించడం సమంజసం కాదని అవే డబ్బులో కొత్త లైట్లు వచ్చే అవకాశం ఉందని వాటిపై దృష్టి సాధించాలని విజ్ఞప్తి చేశారు. పవర్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారితో చేసుకునే అగ్రిమెంట్ ద్వారా కార్పొరేషన్ నష్టం జరుగుతుందని దాదాపు నాలుగున్నర కోట్ల రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితులు ఉన్నాయి కనుక ఆ డబ్బుతో మనమే కార్పొరేషన్ లో ఎలక్ట్రికల్ విభాగాన్ని మరింత మెరుగుపరుచుకోవచ్చని సూచన చేశారు. అలాగే అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కి సంబంధించిన ప్రాజెక్టుల కోసం డిపిఆర్ ను మన ఇంజనీరింగ్ సెక్షన్ వారితో తయారు చేపిస్తే కన్సల్టెన్సీలను సంప్రదించాల్సినటువంటి అవసరం గాని వారికి పెట్టుబడి పెట్టే డబ్బులు గానీ మున్సిపల్ కార్పొరేషన్ కి మిగులుతది అని చెప్పి కోరారు. ఇంకుడు గుంతల కోసం 60 లక్షల రూపాయల కేటాయించే మున్సిపల్ అధికారులు ఒక్కసారి మున్సిపల్ కార్యాలయం వెనుకకు వెళ్లి చూస్తే రోజు ట్యాంకర్ నీళ్లను వేస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి బయటికి సలహాలు ఇవ్వడం తగ్గించే ముందు మనం పాటించడం నేర్చుకోవాలని హితవ్ పలికారు .

టేబుల్ ఎజెండాగా పెట్టిన అంశాలను పూర్తి గా వ్యతికేరిస్తున్న అని, పాత విషయాలను టేబుల్ ఎజెండగా చేర్చడం వింతగా ఉందని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు కార్పోరేటర్లకు మొబైల్ ఇవ్వడానికి తాను వ్యక్తిగతంగా వ్యతిరేకిస్తున్నానని ఆ 30 లక్షలను రూపాయి అంత్యక్రియలకు వాడితే పేద ప్రజలకు సహకరించిన వాళ్ళమవుతామని సూర్య అన్నారు.

గత సమావేశాలకు సంబంధించిన మినిట్స్ సభ్యులు మాట్లాడిన వివరాలు రిజల్యూషన్ పైన అధికారులు తీసుకున్న చర్యలు ఇప్పటివరకు ఎన్ని పూర్తి కావచ్చాయో ఎన్ని పెండింగ్ ఉన్నాయో పూర్తి వివరాలను కౌన్సిల్లో ప్రకటించాలని డిమాండ్ చేశారు కమిషనర్ గారు అనేకసార్లు అధికారుల జీతాలను వాళ్ళని ఇబ్బందుల గురి చేస్తున్నందున అధికారుల జీతాలను ఆపడం సరికాదని కమిషనర్ గారికి వివరించారు. అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి సంబంధించిన ప్రాజెక్టులు అవినీతి జరిగిందని అలాగే నాణ్యతతో పని జరగడంలేదని పార్టీ కంట్రోల్ తో ఎంక్వయిరీ చేయించాలని ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోనందున దానికి సంబంధించిన పూర్తి వివరాలను అందజేయాలని డిమాండ్ చేశారు.అలాగే రామగుండం కార్పొరేషన్ వెనకాల అనేక వెహికల్స్ ఎండకు వానకు ఉండి పూర్తిగా ఖరాబ్ అవుతున్నాయని కొంత డబ్బు ఖర్చు చేస్తే వెహికల్ మరోసారి రోడ్డు మీదకి వచ్చే అవకాశం ఉందని సూర్య అన్నారు.

కచ్చితంగా వెహికల్స్ కోసం టెక్నికల్ టీం ఏర్పాటు చేసి ఎస్టిమేషన్ వేయించి ప్రతి వెహికల్ ని మళ్ళీ ఉపయోగంలోకి తీసుకురావాలని సూర్య డిమాండ్ చేశారు. అలాగే మహిళా కార్పొరేటర్కు కలెక్టర్ ఇచ్చిన నోటీసు వెనక్కి తీసుకోవాలని కార్పొరేటర్ అందరం ఐక్యతతో ఆ తీర్మానం చేసుకుంటారని కార్పొరేటర్లకు చేశారు ప్రజా సమస్యలపై పోరాడే వారిని చెప్పు చేతల్లో కొప్పుకోవాలని చూసా అధికారులకు తగిన బుద్ధి చెబుతామని అన్నారు

Related Articles

Most Popular