Sunday, April 12, 2026

రామగుండంట్రాఫిక్ పోలీస్ ఆధ్వర్యంలో డ్రైవర్లకు ఉచిత కంటి,షుగర్,బీపీ పరీక్షలుచేయించడం జరిగింది

MS8NEWS గోదావరిఖని ఫిబ్రవరి 28 : రామగుండం ట్రాఫిక్ పోలీస్ – “ *అరైవ్ అలైవ్ 2026”* రహదారి భద్రత మరియు నియమాలు పాటించుట 2వ దశ, రాష్ట్రవ్యాప్తంగా 22-02-2026 నుండి 28-02-2026 వరకు నిర్వహించబడుతుంది. మన రామగుండం కమిషనరేట్ పరిధిలో రహదారి భద్రతను పెంపొందించడానికి, కమిషనర్ ఆఫ్ పోలీస్ రామగుండం ఆదేశాల మేరకు సి.హెచ్. శ్రీనివాస్ ట్రాఫిక్ ఏసీపి, రామగుండం ఆధ్వర్యంలో రామగుండం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో *ఉచిత కంటి పరీక్ష* మరియు *షుగర్ బీపీ పరీక్షలు* చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో లారీ డ్రైవర్లు, ఆటోడ్రైవర్లు, స్కూల్ బస్సు డ్రైవర్లు కు వారి కంటి పరీక్ష చేయించడం జరిగింది *లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో* ఈ పరీక్షలు చేయించడం జరిగింది. సుమారు 200 మంది డ్రైవర్లు పరీక్ష చేయించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏసీ పి శ్రీనివాసులు మాట్లాడుతూ డ్రైవర్లు తమ గమ్యస్థానానికి సురక్షితంగా చేరుకోవాలని వారు సురక్షితమైన మార్గంలో పోవాలని వారికి సంబంధించిన డాక్యుమెంట్లు వాహనానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఉంచుకోవాలని. మద్యం తాగి వాహనం నడపరాదని ట్రాఫిక్ రూల్స్ ను పాటించాలని వారు తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో బి. రాజేశ్వరరావు ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రామగుండం, జి. హరి శేఖర్ మరియు N. రామరాజు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మరియు ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది పాల్గొనడం జరిగింది.

Related Articles

Most Popular