Sunday, April 12, 2026

2026 ఉగాది పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం..

MS8NEWS ఫిబ్రవరి 16 : ఉగాదిపర్వదినం పురస్కరించుకొని, వెలుగు సామాజిక స్వచ్చంద సంస్థ ,(వి.ఎస్.ఎస్.ఎస్) ఆధ్వర్యంలో అందించే ఉగాది పురస్కారాల కోసం ఉభయ తెలుగు రాష్ట్రాలలో వివిధ రంగాల్లో సేవలందిస్తున్న స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు, సామాజిక సేవకులు, కవులు, కళాకారులు, పురోహితులు, విద్య, వైద్య రంగం, సాహిత్యం, సంగీతం, నృత్యం, చిత్రలేఖనం, శిల్పం, జానపదం, మిమిక్రి, ఇంద్రజాలం, హరికథ, బుర్రకధ, కోలాటం మొదలైన అంశాలతో పాటూ తదితర సేవా రంగాలకు కూడా వారికి ఈ పురస్కారాలు ఇవ్వడం జరుగుతుంది అని. వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ ఫౌండర్ అండ్ చైర్మన్ డాక్టర్ సురభి శ్రీధర్ తెలిపారు. ఆసక్తి గలవారు పురస్కారాలకు దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు 8977748838 నంబర్ ను సంప్రదించాలని. డాక్టర్ సురభి శ్రీధర్ తెలిపారు.

Related Articles

Most Popular