Monday, April 13, 2026

తక్కలపల్లిలో సమ్మక్క–సారలమ్మ గద్దెల నిర్మాణ పనుల పరిశీలన ​పనులను వేగవంతం చేయాలని అధికారులకు ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ ఆదేశం

MS8NEWS రామగుండం, జనవరి 21:రామగుండం నియోజకవర్గ పరిధిలోని తక్కలపల్లి గ్రామంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమ్మక్క–సారలమ్మ గద్దెల నిర్మాణ పనులను స్థానిక శాసనసభ్యులు శ్రీ ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ బుధవారం అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

క్షేత్రస్థాయి పరిశీలన గద్దెల నిర్మాణ పురోగతిని, వినియోగిస్తున్న సామగ్రి నాణ్యతను ఎమ్మెల్యే ఈ సందర్భంగా తనిఖీ చేశారు. రాబోయే జాతర నాటికి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలతో ఈ నిర్మాణాలను పూర్తి చేయాలని ఆయన అధికారులకు సూచించారు.

​గడువులోగా పూర్తి: నిర్మాణ పనుల్లో జాప్యం వహించకుండా, నిర్దేశిత గడువులోగా పనులన్నీ పూర్తి చేయాలి. నిర్మాణంలో ఎక్కడా రాజీ పడకుండా నాణ్యతా ప్రమాణాలను పాటించాలి.జాతర సమయానికి భక్తులకు అవసరమైన మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని సంబంధిత శాఖాధికారులను ఆదేశించారు.

​ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, వివిధ శాఖల అధికారులు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.

Related Articles

Most Popular