Monday, April 13, 2026

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పోలింగ్ కేంద్రాల తుది జాబితా విడుదల

MS8NEWS రామగుండం, జనవరి 16:తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాల మేరకు, రామగుండం నగర పాలక సంస్థ పరిధిలోని పోలింగ్ కేంద్రాల తుది జాబితాను శుక్రవారం అధికారికంగా ప్రచురించారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం నిర్ణీత గడువులోగా పోలింగ్ కేంద్రాల వారీగా ఫోటో ఓటరు జాబితాతో కూడిన ఈ తుది జాబితాను నగర పాలక సంస్థ కార్యాలయంలో విడుదల చేశారు.ఈ కార్యక్రమం రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో ఘనంగా జరిగింది. అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) మరియు రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్ (FAC) జె. అరుణశ్రీ ఈ జాబితాను విడుదల చేస్తూ, ఎన్నికల ప్రక్రియలో భాగంగా క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం పారదర్శకంగా ఈ కేంద్రాలను ఖరారు చేసినట్లు పేర్కొన్నారు.​రామన్ – ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్,ఉమా మహేశ్వర రావు – సెక్రెటరీ,​పబ్బాల శ్రీనివాస్ – సూపరింటెండెంట్,హిమజ, సింధూజ, శ్రావణ్ – టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్స్ (TPBOs)పాల్గొన్నారు

ప్రతి పోలింగ్ కేంద్రానికి సంబంధించి ఫోటోలతో కూడిన ఓటరు జాబితాను సిద్ధం చేశారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం భౌగోళిక పరిస్థితులు, ఓటర్ల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని పోలింగ్ కేంద్రాలను కేటాయించారు. ఈ తుది జాబితాను స్థానిక ప్రజల సమాచారం నిమిత్తం మున్సిపల్ కార్యాలయ నోటీసు బోర్డుపై అందుబాటులో ఉంచారు.రాబోయే ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఈ జాబితా ప్రచురణ అత్యంత కీలకమైన అడుగు అని అధికారులు ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.

Related Articles

Most Popular