Monday, April 13, 2026

పాలకుర్తి మండల పెరిక సంఘం కమిటీ ఏర్పాటు..!రాష్ట్ర మహిళా నాయకురాలు చేతుల మీదుగా పెరిక సంఘం నూతన సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ…!

(MS8NEWS జనవరి 3):పాలకుర్తి మండల పెరిక సంఘం కమిటీ ఏర్పాటు..!రాష్ట్ర మహిళా నాయకురాలు చేతుల మీదుగా పెరిక సంఘం నూతన సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ…!

కుక్కలగూడూరు గ్రామంలో పురిగరి క్షత్రియ పెరిక సంఘం పాలకుర్తి మండల కమిటీని అధికారికంగా ఏర్పాటు చేశారు…ఈ కార్యక్రమానికి పెరిక సంఘం రాష్ట్ర మహిళా నాయకురాలు కందుల సంధ్యారాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా నూతనంగా ఏర్పాటైన కమిటీ ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. అనంతరం కమిటీ సభ్యులకు ముఖ్య అతిథులు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారిని ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో కందుల సంధ్యారాణి మాట్లాడుతూ, పెరిక సంఘం అభివృద్ధి కోసం ఎల్లప్పుడూ తన వంతు కృషి చేస్తానని, సంఘాన్ని మరింత బలోపేతం చేయడానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో కుక్కల గూడూరు గ్రామ సర్పంచ్ మేడం దేవమ్మ -బాపన్న మరియు గోపు రామన్న,బోడకుంటి తిరుపతి,మేడం తిరుపతి, నల్లమల సాగర్,చెల్లె శీను, కందుల శీను, బోడకుంటి సత్తయ్య, బియ్యాల విటల్, పోతురాజుల శంకరయ్య,పత్తిపాక సుధాకర్, మేడం బాపు,ముద్దసాని సతీష్,బడుగు తిరుపతి, పతిపాక శంకరయ్య,నలిమల మల్లేష్, చెల్లె సత్తయ్య, మేడం సాయన్న తదితరులు పాల్గొన్నారు…

Related Articles

Most Popular