(MS8NEWS డిసెంబర్ 29):అధికారిక పదవిలో లేని వ్యక్తికి సర్వీస్ రూల్స్ ఉల్లంఘించి సెల్యూట్ చేయడంపై నెటిజన్ల నుంచి వెల్లువెత్తుతున్న విమర్శలు.మాజీ ఎమ్మెల్సీ కొండా మురళికి సీఐ రమేష్ సెల్యూట్ చేయడంపై పోలీస్ వర్గాల్లోనూ అంతర్గత చర్చ!వైరల్ అవుతున్న ఫోటోలో మరో కీలక పోలీస్ స్టేషన్ అధికారి కూడా ఉన్నట్లు ప్రచారం.. విస్మయం వ్యక్తం చేస్తున్న నగర ప్రజలు.ప్రజా సేవకులుగా ఉండాల్సిన అధికారులు, రాజకీయ నాయకుల వద్ద “గులాంగిరీ” చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం.గతంలోనూ వివాదాల్లో చిక్కుకున్న సదరు స్టేషన్ అధికారులు.. సస్పెన్షన్లు, బదిలీల చరిత్రను గుర్తుచేస్తున్న నిఘా వర్గాలు.రాజకీయ నాయకుల అండదండలతోనే కీలక పోస్టింగ్‌లు దక్కించుకుంటున్నారనే ఆరోపణలకు బలం చేకూరుస్తున్న తాజా ఘటన!యూనిఫాంలో ఉండి ప్రైవేట్ వ్యక్తులకు గౌరవవందనం చేయడంపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.కొందరు అధికారుల అతి ఉత్సాహం వల్ల మొత్తం పోలీస్ వ్యవస్థకే మచ్చ వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్న మాజీ పోలీస్ అధికారులు.
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఫోటోల వెనుక ఉన్న రాజకీయ సమీకరణాలపై వరంగల్ జిల్లాలో హాట్ టాపిక్!

