(MS8NEWS డిసెంబర్ 24): నటుడు శివాజీ ఇటీవల తన కొత్త సినిమా ‘దండోరా’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలకు నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియా వేదికగా గట్టి కౌంటర్ ఇచ్చారు.’దండోరా’ ఈవెంట్‌లో శివాజీ మాట్లాడుతూ, నేటితరం హీరోయిన్ల వస్త్రధారణపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.”మహిళల అందం చీరకట్టులోనే ఉంటుంది.”హీరోయిన్లు పబ్లిక్ ఈవెంట్లకు వచ్చేటప్పుడు పద్ధతిగా ఉండాలని, గ్లామర్ పేరుతో శరీరం ఎక్కువగా కనిపించేలా (కొన్ని అసభ్య పదాలు వాడుతూ) బట్టలు వేసుకోవడం సరైంది కాదని ఆయన విమర్శించారు.
అనసూయ ఇచ్చిన ఘాటు కౌంటర్:శివాజీ వ్యాఖ్యలపై అనసూయ సోషల్ మీడియాలో ఇన్ డైరెక్ట్ గా, కానీ చాలా పవర్‌ఫుల్ గా స్పందించారు:
”నా బాడీ.. నా ఇష్టం”: మహిళలు ఏ దుస్తులు వేసుకోవాలనేది వారి వ్యక్తిగత నిర్ణయమని, అది ఇతరులకు సంబంధం లేని విషయమని ఆమె పేర్కొన్నారు.”శివాజీ గారి మైండ్‌సెట్ చూస్తుంటే జాలి వేస్తోంది” అంటూ ఆమె సెటైర్లు వేశారు. సంస్కృతి, పద్ధతి అనే పేరుతో మహిళల స్వేచ్ఛను హరించడం, వారిపై మోరల్ పోలీసింగ్ చేయడం సరికాదని ఆమె స్పష్టం చేశారు. పురుషులు తమకు నచ్చిన జీన్స్, హూడీలు వేసుకున్నప్పుడు లేని అభ్యంతరం, హీరోయిన్ల విషయంలోనే ఎందుకు వస్తుందని ఆమె ప్రశ్నించారు.అనసూయతో పాటు మరికొందరు సినీ ప్రముఖులు కూడా శివాజీ వ్యాఖ్యలను తప్పుబట్టారు
శివాజీ వ్యాఖ్యలపై తెలంగాణ మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద సీరియస్ అయ్యారు. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలిపారు.ఈ వివాదం ముదరడంతో శివాజీ తాజాగా ఒక వీడియో సందేశం విడుదల చేస్తూ, తాను మంచి ఉద్దేశంతోనే చెప్పానని, ఎవరైనా హర్ట్ అయ్యి ఉంటే క్షమించాలని కోరారు.

