Wednesday, February 11, 2026

పెద్దపల్లి జిల్లాలో “కళాతోరణం ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్” ఆవిర్భావం,కళాకారుల ప్రతిభను ప్రపంచానికి చాటడమే లక్ష్యం..

(MS8NEWS డిసెంబర్ 23): పెద్దపల్లి జిల్లాలో “కళాతోరణం ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్” ఆవిర్భావం,కళాకారుల ప్రతిభను ప్రపంచానికి చాటడమే లక్ష్యం.తెలంగాణ షార్ట్ ఫిలిం ప్రొడ్యూసర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అడుగులు.

సమాజంలో కళలకు, కళాకారులకు ఉన్న ప్రాముఖ్యతను గుర్తించి, వారి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పెద్దపల్లి జిల్లాలో **”కళాతోరణం ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్”**ను ఏర్పాటు చేసినట్లు తెలంగాణ షార్ట్ ఫిలిం ప్రొడ్యూసర్ వెల్ఫేర్ అసోసియేషన్ (పెద్దపల్లి శాఖ) అధ్యక్షులు కొమ్మ కుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు.​నేటి సోషల్ మీడియా యుగంలో కళాకారులకు అవకాశాలు మెండుగా ఉన్నప్పటికీ, వారిని సరైన దిశలో నడిపించేందుకు, వృత్తిపరమైన ఇబ్బందులను తొలగించేందుకు ఈ వేదిక నిరంతరం కృషి చేస్తుందని ఆయన పేర్కొన్నారు. జిల్లాలోని ప్రతి పల్లెలో ఉన్న కళాకారుడిని గుర్తించి, వారిని ఈ సంఘం ద్వారా బలోపేతం చేస్తామని వెల్లడించారు.సంఘం నిర్మాణం కోసం సీనియర్ల సూచనల మేరకు తాత్కాలిక కమిటీని ఈ క్రింది విధంగా నియమించారు:

​అడ్వైజరీ కమిటీ సభ్యులు: దామెర శంకర్, దయానంద్ గాంధీ, పి.ఎస్. అమరేందర్, సి.హెచ్. ఉపేందర్.

​కన్వీనర్: అమేజింగ్ స్టార్ అశోక వేముల.

​కో-కన్వీనర్లు:

​ఆంజనేయులు (గర్రెపల్లి)

​దాసరి కుమార్ (సుల్తానాబాద్)

​బొడ్డుపల్లి రామ్మూర్తి (పెద్దపల్లి)

​జక్కని శ్రీలత, మేకల శ్రీకాంత్, నగునూరి విజయ్, బడికల గణేష్, దామెర రాజేష్ (గోదావరిఖని)

​మేకల మారుతి (కమాన్పూర్)

​రోయ్ వేణుగోపాల్ (మంథని)

​త్వరలోనే పూర్తిస్థాయిలో సంఘం నిర్మాణాన్ని పూర్తి చేసి, జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రతి కళాకారుడికి బాధ్యతలు అప్పగిస్తామని కుమార్ యాదవ్ తెలిపారు. కళాకారులు, కళాపోషకులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

Related Articles

Most Popular