Thursday, July 30, 2026

కూకట్‌పల్లి వై-జంక్షన్ వద్ద తప్పిన పెను ప్రమాదం: కారులో ఎగిసిపడిన మంటలు

(MS8NEWS డిసెంబర్ 21)​హైదరాబాద్: నగరంలోని కూకట్‌పల్లి వై-జంక్షన్ సమీపంలో ఆదివారం భారీ ప్రమాదం తప్పింది. ప్రయాణికులతో వెళ్తున్న ఒక కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు, ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.

కారు వై-జంక్షన్ వద్ద ప్రయాణిస్తుండగా ఇంజిన్ భాగం నుండి ఒక్కసారిగా పొగలు వచ్చి మంటలు ఎగిసిపడ్డాయి. అక్కడ విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే స్పందించారు. అందుబాటులో ఉన్న వనరులతో మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు.మంటలు వ్యాపించకముందే కారులో ఉన్న ప్రయాణికులు కిందకు దిగిపోవడంతో ప్రాణాపాయం తప్పింది.

​సమయస్ఫూర్తితో వ్యవహరించి, పెద్ద ప్రమాదం జరగకుండా అడ్డుకున్న ట్రాఫిక్ సిబ్బందిని వాహనదారులు మరియు స్థానికులు అభినందిస్తున్నారు. సకాలంలో స్పందించకపోతే కారు పూర్తిగా దగ్ధమై పక్కనే ఉన్న ఇతర వాహనాలకు కూడా ముప్పు వాటిల్లేదని వారు పేర్కొన్నారు.

Related Articles

Most Popular