Monday, April 13, 2026

కోతుల బెడదకు ‘ఎలుగుబంటి’ విరుగుడు: యువ సర్పంచ్ వినూత్న ప్రయోగం!

(MS8NEWS డిసెంబర్ 20 నిర్మల్/కడెం): ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో కొందరు నేతలు కొత్త పుంతలు తొక్కుతున్నారు. సాధారణంగా కోతుల సమస్య అంటే మున్సిపల్ అధికారులకో, అటవీ శాఖకో ఫిర్యాదు చేస్తారు. కానీ, నిర్మల్ జిల్లా కడెం మండలం లింగాపూర్ గ్రామ సర్పంచ్ మాత్రం రూటు మార్చారు.
​లింగాపూర్ గ్రామంలో గత కొంతకాలంగా కోతుల బెడద తీవ్రంగా ఉంది. పంటలను నాశనం చేయడమే కాకుండా, ఇళ్లలోకి దూరి సామాన్య ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఇటీవలే జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మద్దతుతో గెలుపొందిన యువ సర్పంచ్ కుమ్మరి రంజిత్, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు.​కోతులు మనుషులకు భయపడటం లేదని గ్రహించిన రంజిత్, వాటిని భయపెట్టేందుకు ఒక వినూత్న ఆలోచన చేశారు. తానే స్వయంగా ఎలుగుబంటి వేషం వేసుకుని గ్రామంలోని వీధుల్లో, కోతులు ఎక్కువగా ఉండే చెట్ల వద్ద తిరుగుతున్నారు. అకస్మాత్తుగా ఎలుగుబంటిని చూసిన కోతులు భయంతో గ్రామం వదిలి పరుగులు తీశాయి.
​ప్రజా స్పందన: సమస్య పరిష్కారానికి సర్పంచ్ పడుతున్న తాపత్రయాన్ని చూసి గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. “సర్పంచ్ అంటే కేవలం కుర్చీలో కూర్చోవడం కాదు, ఇలా ప్రజల మధ్య ఉండి సమస్యలు తీర్చాలి” అంటూ రంజిత్‌ను మెచ్చుకుంటున్నారు.
​”కోతుల వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూడలేక ఈ ప్రయత్నం చేశాను. గ్రామాన్ని కోతుల రహితంగా మార్చే వరకు నా వంతు కృషి చేస్తాను అనీ కుమ్మరి రంజిత్, సర్పంచ్ తెలిపారు

 

Related Articles

Most Popular