భారత మార్కెట్లో రియల్ మీ తన కొత్త Narzo 90 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్ ప్రత్యేకించి యువతను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడింది. శక్తివంతమైన బ్యాటరీ, ఆధునిక డిజైన్, మరియు 5G కనెక్టివిటీ కలిగిన ఈ ఫోన్ రోజువారీ ఉపయోగాలకు సరైన ఎంపికగా నిలుస్తుంది.
రియల్ మీ ఈ మోడల్‌ని ప్రీమియం లుక్, మన్నికైన నిర్మాణం, స్లిమ్ డిజైన్, ఆకర్షణీయమైన రంగులు మరియు ఆధునిక టెక్నాలజీతో కూడి వినియోగదారులకు కొత్త అనుభవాన్ని అందించేందుకు తీసుకువచ్చింది.
**రియల్ మీ నార్జో 90 5G ఫీచర్లు:**
**డిస్‌ప్లే:**
6.57 అంగుళాల AMOLED ఫ్లెక్సిబుల్ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌తో ఉంటుంది. FHD+ రిజల్యూషన్ (2372 × 1080), 4000nits పీక్ బ్రైట్‌నెస్ వలన సూర్యకాంతిలో కూడా డిస్‌ప్లే స్పష్టంగా కనిపిస్తుంది.
**పెర్ఫార్మెన్స్:**
MediaTek Dimensity 6400 MAX ప్రాసెసర్‌తో త్వరితమైన పనితీరును అందిస్తుంది. Mali G57 MC2 GPU గేమింగ్ అనుభవాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే, AI ఎఫిషియెన్సీ బూస్టర్ మరియు పెద్ద VC కూలింగ్ సిస్టమ్ ద్వారా ఫోన్ వేడెక్కకుండా ఉంటుంది.
**కెమెరా:**
ఈ ఫోన్‌లో 50MP వైడ్ ఎంగిల్ కెమెరాతో కూడిన రియర్ కెమెరా సెటప్ ఉంటుంది, అలాగే 2MP మోనోక్రోమ్ లెన్స్ ఉంది. సెల్ఫీ మరియు వీడియో కాలింగుకు ముందు భాగంలో 50MP కెమెరా అందిస్తారు, ఇది అత్యుత్తమ క్లారిటీని అందిస్తుంది. వీడియో రికార్డింగ్‌ను 1080p @ 60fps వరకు సపోర్ట్ చేస్తుంది. పోర్ట్రైట్, నైట్, పనోరమా, సినిమటిక్ వంటి అనేక మోడ్‌లు అందుబాటులో ఉన్నాయి.
**బ్యాటరీ:**
7000mAh భారీ బ్యాటరీతో పాటు ఇది 60W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. కేవలం 31 నిమిషాల్లో బ్యాటరీ 50% వరకు చార్జ్ అవుతుంది. రివర్స్ ఛార్జింగ్ మరియు బైపాస్ ఛార్జింగ్ సపోర్ట్‌కు కూడా వీలుంది.
**సెక్యూరిటీ & సెన్సార్లు:**
ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ మరియు ఫేస్ అన్‌లాక్ ఆప్షన్లు ఉన్నాయి. Proximity, Ambient Light, Gyroscope, Accelerometer, Infrared Remote వంటి ఇతర సెన్సార్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
**కనెక్టివిటీ:**
5G నెట్‌వర్క్‌తో పాటు 2G, 3G, 4G LTE సపోర్ట్ చేసింది. Wi-Fi 2.4GHz/5GHz మరియు Bluetooth 5.3 అందించబడింది. USB Type-C మధ్యమంగా హెడ్‌ఫోన్ కనెక్షన్ ఉండగా NFC సపోర్ట్ లేదు.
**డిజైన్:**
ఈ ఫోన్ Victory Gold మరియు Carbon Black అనే రెండు ఆకర్షణీయ రంగుల్లో లభిస్తోంది. 7.79mm మందంతో రూపకల్పన చేయబడిన ఈ ఫోన్ కేవలం 181 గ్రాముల తక్కువ బరువుతో వస్తుంది. భారీ 7000mAh బ్యాటరీ ఉన్నప్పటికీ ఇది స్లిమ్‌గా మరియు స్టైలిష్‌గా ఉంటుంది.
**ఇతర లక్షణాలు:**
Android 15 ఆధారిత Realme UI 6.0 ప్రాసెసింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. నాలుగు OS అప్‌డేట్స్‌తో పాటు మూడు సంవత్సరాల భద్రతా అప్‌డేట్స్ అందిస్తారు. IP66/68/69 రేటింగ్ కలిగిన ఈ ఫోన్ డస్ట్ మరియు వాటర్ ప్రొటెక్షన్ కలిగి ఉంది. అలాగే, డ్యూయల్ స్టీరియో స్పీకర్లతో అధ్బుతమైన ఆడియో అనుభవాన్ని అందిస్తుంది.
**ధర & లభ్యత:**
Realme Narzo 90 5G బేస్ వేరియంట్ (6GB RAM + 128GB స్టోరేజ్) ధర రూ.16,999 టాప్-ఎండ్ వేరియంట్‌కి 8GB RAM మరియు 128GB స్టోరేజ్ ఉంది, దీని ధర రూ. 18,499. ఈ ఫోన్ డిసెంబర్ 24 నుండి అమెజాన్ మరియు రియల్మీ స్టోర్లలో అమ్మకానికి అందుబాటులో ఉంటుంది.

