MS8NEWS 16/12/2025:నల్గొండ బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థికి పోలైన ఓట్లు మురికి కాలువలో దొరికిన ఘటనలో ఏంపీడీవోతో సహా 12 మందిపై సస్పెన్షన్ వేటు
నల్లగొండ జిల్లా చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామంలో ఓ డ్రైనేజీ కాల్వలో లభ్యం అయిన బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి బిక్షపతికి పోలైన బ్యాలెట్ పేపర్ ఓట్లు.ఈ ఘటనపై ఆందోళన తెలియజేసి, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, మాజీ రాజ్యసభ ఎంపీ లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు చిరుమూర్తి లింగయ్య, కంచర్ల భూపాల్ రెడ్డి
ఈ ఘటనపై ఇప్పటికే ఆర్వోను సస్పెండ్ చేసిన కలెక్టర్
తాజాగా ఎంపీడీవో జయలక్ష్మి, స్టేజ్ 2 అధికారి విజయ్ కుమార్‌తో సహా 12 మందిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్

