Saturday, September 12, 2026

జెన్ Z ట్రావెల్ వ్లాగర్ స్వాతి రోజాను అభినందించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్..

(MS8NEWS డిసెంబర్ 23): ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయంలో యువ ట్రావెల్ వ్లాగర్ స్వాతి రోజాను అభినందించారు. దేశవ్యాప్తంగా బైక్‌పై ఒంటరిగా ప్రయాణిస్తూ (Solo Bike Trip) ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శిస్తున్న ఆమె సాహసాన్ని ఆయన మెచ్చుకున్నారు.

​స్వాతి రోజా దేశవ్యాప్తంగా బైక్‌పై ప్రయాణిస్తూ, మన దేశంలోని ఆధ్యాత్మిక విశేషాలను తన వ్లాగ్స్ ద్వారా ప్రజలకు చేరవేస్తున్నారు. ఆమె ప్రస్తుతం “12 జ్యోతిర్లింగాల యాత్ర” లో భాగంగా ఏపీలో పర్యటించారు. కొన్ని వారాల క్రితం ఆమె శ్రీశైలం సందర్శించిన సమయంలో వసతి, భద్రత పరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించి, ఆమెకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఉప ముఖ్యమంత్రి ఆదేశాలతో ఆమెకు శ్రీశైలం, తిరుమల, శ్రీకాళహస్తి మరియు విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాల్లో ప్రత్యేక దర్శన ఏర్పాట్లు జరిగాయి. దుర్గమ్మ దర్శనం ముగించుకున్న అనంతరం, ఆమె మంగళగిరిలో పవన్ కళ్యాణ్‌ను కలిసి ఆయన చూపిన చొరవకు ధన్యవాదాలు తెలిపారు.ఈ భేటీలో పవన్ కళ్యాణ్ తనకు బైక్ రైడింగ్‌పై ఉన్న ఆసక్తిని, తన వ్యక్తిగత బైకింగ్ అనుభవాలను స్వాతి రోజాతో సరదాగా పంచుకున్నారు.

​స్వాతి రోజా ఒక ప్రముఖ Gen-Z ట్రావెల్ వ్లాగర్. ఆమె తన యూట్యూబ్ ఛానెల్‌లో దాదాపు 4 లక్షల మంది సబ్‌స్క్రైబర్‌లను కలిగి ఉన్నారు. 10,000 కిలోమీటర్ల పైగా సోలో బైక్ జర్నీ చేసిన రికార్డు ఆమె సొంతం. ఆమె ముఖ్యంగా ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శిస్తూ యువతకు మన సంస్కృతిపై అవగాహన కలిగిస్తున్నారు.

Related Articles

Most Popular