MS8NEWS గోదావరిఖని 15 : ఉగాది పండుగను పురస్కరించుకొని ప్రతి సంవత్సరం సాంప్రదాయబద్ధంగా పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం పెద్దంపేట గ్రామంలో లక్ష్మీదేవి ఉత్సవాలు ఆదివాసి బిడ్డల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఓ బి సి సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్ నిర్వాహకులకు కండువాలు పంపిణీ చేశారు,కండువాలు పంపిణీ చేసిన అనంతరం కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్ మాట్లాడుతూ మహాభారత సమయంలో రాజ్యాన్ని వదిలి వనవాసం చేస్తున్న పంచపాండవులు అనేక ప్రాంతాలు తిరుగుతూ మన ప్రాంతంలో కూడా పర్యటించిన సందర్భంలో ఆది నుంచి ఆదివాసి బిడ్డలు వారికి అండగా నిలిచిన నేపథ్యంలో వారి గుర్తుగా శ్రీకృష్ణుని సూచనలను అదేవిధంగా పంచ పాండవుల అరణ్యవాస గాధను తెలియజేసే విధంగా ఆదివాసీల ఆడబిడ్డ లక్ష్మీ దేవర ఉత్సవాలను మా గ్రామంలో మా గ్రామ బిడ్డలైన ఆదివాసీలు ఘనంగా నిర్వహించి ప్రతి ఇంటికి లక్ష్మీదేవిని తీసుకువెళ్లి ప్రతి ఇంటిలో లక్ష్మీదేవరా ఆశీస్సులతో లక్ష్మీ కటాక్షం కలిగే విధంగా నిస్వార్ధంగా చేస్తున్న ఉత్సవాలు రాబోయే రోజుల్లో కూడా మరింత ఘనంగా జరిగే విధంగా మా వంతు పాత్రను మా సహకారాన్ని అందిస్తామని ఈ సంవత్సరం ఆదివాసీల సూచిక వారి ఆత్మ గౌరవం తెలియజేసే కండువాలను పంపిణీ చేయడం ఈ అవకాశాన్ని నాకు ఈయడం ఎంతో సంతోషకరమని రాబోయే రోజుల్లో కూడా ఏ అవసరమున్న ఆదివాసీలకు అండగా ఉంటానని తెలియజేశారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్ తో పాటు అంతర్గాం మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సింగం కిరణ్ గౌడ్ గ్రామ శాఖ అధ్యక్షులు మెరుగు కుమార్ గౌడ్ కిసాన్ సెల్అధ్యక్షులు పల్లె రవీందర్ యూత్ కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు ఆదివాసి నాయకులు ఊరేటి మహేష్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పైడిపల్లి ప్రసాద్ తో పాటు పెద్దంపేట గ్రామ ఆదివాసి సంఘం అధ్యక్షులు సుధాకర్ పెద్దమనుషులు పెద్దల రమేష్ పటాని మహేష్ ఊరేటి సాయి గంగారాం పద్మక్క రాజేశ్వరి చీకటయ్య అఖిల నవీన్ ఊరేటి ప్రణయ్ ఊరేటి రాకేష్ పరకాల వెంకటస్వామి పరకాల శ్రీశైలం శ్యాంసుందర్ రెడ్డి అధిక సంఖ్యలో గ్రామ నాయకులు ఆదివాసి బిడ్డ లు మహిళలు పాల్గొన్నారు

