Sunday, April 12, 2026

మహిళా సాధికారత తమ ప్రభుత్వ లక్ష్యం : రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి

MS8NEWS రామగుండం మార్చ్ 8 : మహిళా సాధికారత తమ ప్రభుత్వ లక్ష్యమని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి అన్నారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో శనివారం నిర్వహించిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం, ఇందిరా మహిళా శక్తి ద్వారా స్వశక్తి మహిళలకు తక్కువ వడ్డీకే రుణాలు, ఉపాధి అవకాశాలు తమ ప్రభుత్వం కల్పిస్తున్నదని అన్నారు . స్వశక్తి మహిళలతో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు , సోలార్ ప్లాంట్లు , ఆర్ టి సి అద్దె బస్సులు , పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయించడానికి ఎం ఎల్ ఎ రాజ్ ఠాకూర్ గారి ఆధ్వర్యంలో ప్రయత్నం చేయడం జరుగుతున్నదని అన్నారు. అమృత్ మిత్ర పథకం ద్వారా మహిళలకు ఆర్థిక సహకారం అందిo చడానికి మున్సిపల్ కాంట్రాక్ట్ పనులు కూడా అప్పగించడం జరుగుతున్నదని అన్నారు. మెప్మా ద్వారా సభ్యులకు ఇచ్చిన ఋణంతో ఏదైనా వ్యాపారం ఆరంభించడానికి మహిళా పొదుపు సంఘాలకు సహకారం అందిస్తామని అన్నారు. స్థానిక సంస్థల్లో మహిళా రిజర్వేషన్ అమలు చేయడం ద్వారా ఎన్నికైన వార్డు సభ్యురాళ్ళు డివిజన్ లో అభివృద్ది పనులకు సంబందించి కూడా తామే ముందుండాలని అన్నారు.అన్ని సమావేశాల్లోనూ వారే పాల్గొనాలని అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక ఉద్దేశ్యాన్ని నెరవేర్చడానికి చెత్త ఎవరూ బయట పడ వేయకుండా మునిసిపల్ వాహనాలకు అందించాలని ఇంటింటా అవగాహన కల్పించాలని కోరారు.

కాగా ఈ సంధర్భంగా మహిళా ఉద్యోగులకు, ఆర్ పి లకు వివిధ క్రీడాoశాల్లో పోటీలు నిర్వహించారు . గెలిచిన వారికి మేయర్ చేతుల మీదుగా బహుమతుల ప్రదానం చేశారు.ఉత్తమ ప్రతిభ కనబర్చిన మహిళా ఉద్యోగులకు మహిళా కార్పొరేటర్లకు , ఆర్ పి లకు మేమెంటో తో పాటు శాలువా కప్పి సత్కరించారు.

ఈ కార్యక్రమం లో మహిళా కార్పొరేటర్లు భాగ్య లక్ష్మీ , రమాదేవి , మౌనిక , నగర పాలక సంస్థ ఎస్. ఇ . గురువీర , ఇ . ఇ. పి వి రామన్ , ఎ .ఇ . తేజస్విని , టెక్నికల్ ఆఫీసర్ సౌమ్య , మెప్మా టి. ఎం .సి మౌనిక కమ్యూనిటి ఆర్గనైజర్లు ఊర్మిళ , శ్వేత , ప్రియదర్శిని, ఆర్ పి లు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Most Popular