MS8NEWS గోదావరిఖని 28 ఫిబ్రవరి : గోదావరిఖని లోని రావు & శ్రీ అక్షర స్కూల్‌లో వైస్ ప్రిన్సిపల్ ఒక మైనర్ విద్యార్థినిని మానసికంగా వేధిస్తున్నారని ఆరోపిస్తూ ఎంఈఓ, డీఈఓ తదితర సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయబడింది. అయితే “సీబీఎస్‌ఈ క్యాంపస్‌కు ఇది వర్తించదు” అన్న విధంగా స్పందన రావడంతో, బాధిత కుటుంబ సభ్యులు జిల్లా బాలల సంరక్షణ విభాగానికి ఫిర్యాదు చేశారు.దీనిపై స్పందించిన జిల్లా బాలల సంరక్షణ శాఖ అధికారులు స్కూల్‌కు చేరుకుని విద్యార్థులతో ప్రత్యేకంగా విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు వైస్ ప్రిన్సిపల్ తమపై మానసిక వేధింపులకు గురిచేస్తున్నారని, అనుచితంగా ప్రవర్తిస్తున్నారని వెల్లడించినట్లు సమాచారం.
ఈ ఘటనపై ఉన్నతాధికారులు తక్షణమే జోక్యం చేసుకుని పూర్తి స్థాయి దర్యాప్తు నిర్వహించి, చిన్నారులపై జరుగుతున్న ఈ చర్యలకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. సంబంధిత వ్యక్తులను వెంటనే స్కూల్ నుండి తొలగించాలని వారు కోరుతున్నారు.పిల్లల భద్రత, గౌరవం మరియు మానసిక ఆరోగ్యం కాపాడటం ప్రతి విద్యాసంస్థ యొక్క ప్రాథమిక బాధ్యత అని తల్లిదండ్రులు పేర్కొన్నారు.
DWO ఆఫీసర్ వేణుగోపాల్ ఆదేశాల మేరకు,సిడీపీఓ అలేఖ్య పటేల్,సూపర్వైజర్లు షేరీన్, మమత, కనకరాజు విచారణలో పాల్గొన్నారు.

