Sunday, April 12, 2026

రామగుండం నూతన మేయర్‌గా మహంకాళి స్వామి ప్రమాణ స్వీకారం… శుభాకాంక్షలు తెలిపిన దుద్ధిల్లా శ్రీను బాబు, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్

MS8NEWS గోదావరిఖని ఫిబ్రవరి 27 : రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ నూతన మేయర్‌గా మహంకాళి స్వామి లాంఛనంగా బాధ్యతలు స్వీకరించారు. స్థానికంగా జరిగిన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం అత్యంత వైభవంగా, కోలాహలంగా సాగింది.ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి రామగుండం శాసనసభ్యులు (ఎమ్మెల్యే)  మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ తో పాటు, దుద్ధిల్లా శ్రీను బాబు హాజరయ్యారు. మేయర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన  మహంకాళి స్వామి కి వారు ప్రత్యేకంగా పుష్పగుచ్ఛం అందించి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.

నూతన మేయర్ నాయకత్వంలో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి పథంలో దూసుకుపోవాలని, ప్రజలకు మరింత మెరుగైన మౌలిక సదుపాయాలు అందాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షిస్తూ తమ ఉజ్వల భవిష్యత్ శుభాకాంక్షలు అందించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, మరియు స్థానిక ప్రజలు విశేషంగా పాల్గొన్నారు.

 

 

 

 

 

 

Related Articles

Most Popular