Sunday, April 12, 2026

షాప్ చైర్మన్ గా ఉన్న సమయంలోనే క్రీడారంగానికి విశేషమైన సేవలందించిన నాయకులు మన ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్, యువత చెడు త్రోవ పట్టకుండా క్రీడాకారుల నైపుణ్యాన్ని గుర్తిస్తూ టోర్నమెంట్ ఏర్పాటు చేసిన Rpl నిర్వాహకులకు అభినందనలు – నగర మేయర్ మహంకాళి స్వామి

MS8NEWS,గోదావరిఖని, ఫిబ్రవరి 23 :  గోదావరిఖని సింగరేణి స్టేడియం జవహర్ నగర్ లో క్రికెట్ టోర్నమెంట్ Rpl లీగ్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన  ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్  సతీమణి మనాలి రాజ్ ఠాగూర్ నగరపాలక సంస్థ మేయర్  మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతిపెళ్లి ఎల్లయ్య ను Rpl నిర్వాహకుల సమక్షంలో సాధారంగా స్వాగతం పలికి కాంగ్రెస్ పార్టీ యువత అధ్వర్యంలో పల్లికొండ రాజేష్ పుష్పగుచ్చం అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగినది అదేవిధంగా కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్, తాజా కార్పొరేటర్లు రాజిరెడ్డి,ఎండి ముస్తఫా, గట్ల రమేష్,దూళికట్ట సతీష్, దాసరి విజయ్ సన్మానించడం జరిగినది. అనంతరం  మనాలి రాజ్ ఠాగూర్  టాస్ వేసి టోర్నమెంటును ప్రారంభించిన అనంతరం  మేయర్ మహంకాళి స్వామి బ్యాటింగ్ చేయగా డిప్యూటీ మేయర్ వికెట్ కీపింగ్,కార్పొరేటర్లు బౌలింగ్ చేయడం జరిగినది.

మేయర్ మహంకాళి స్వామి మాట్లాడుతూ గతంలోనే ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ షాప్ చైర్మన్ గా ఉన్న సమయంలో క్రీడా రంగ అభివృద్ధికి అనేక రకాలుగా ప్రోత్సాహకాలు అందించారని క్రీడారంగంలో తెలంగాణ దేశంలో అగ్రమార్గామిగా నిలిపేందుకు తన వంతు కృషి చేస్తున్నారని రామగుండంలోని క్రీడాకారులందరినీ ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉంటారని రాబోయే రోజుల్లో రామగుండం నియోజకవర్గాన్ని *క్రీడా హబ్* గా తీర్చిదిద్దేందుకు ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్  కట్టుబడి ఉన్నారని క్రీడాకారులకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్న మా సహకారం ఎల్లవేళలా ఉంటుందని తెలియజేశారు.

మనాలి రాజ్ ఠాగూర్* మాట్లాడుతూ ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ పర్యవేక్షణలో జరుగుతున్న *RPL* క్రికెట్ టోర్నమెంట్ నిర్వాహకులకు ముందుగా అభినందనలు తెలియజేస్తూన్నానని రామగుండం పారిశ్రామిక ప్రాంతం నుండే కాకుండా వివిధ గ్రామాల నుండి *నైపుణ్యం ఉన్న క్రీడాకారులను ఎంపిక చేసి వారిలోని ప్రతిభను వెలికి తీసి* జిల్లాస్థాయిలో రాష్ట్రస్థాయిలో రాణించే విధంగా చేపట్టిన ఈ కార్యక్రమం పూర్తిగా విజయవంతం అవ్వాలని ప్రస్తుత రోజుల్లో యువత తప్పు త్రోవ పడుతున్నటువంటి తరుణంలో ఇలాంటి లీగులు నిర్వహించడం వలన యువతలో మనోధైర్యంతో పాటు పట్టుదల ప్రతిభ బయటపడుతుందని *క్రీడాకారులు జయాప జయాలను స్పోర్టివ్ గా తీసుకోవాలని ఐపీఎల్ లో ఆడే విధంగా మన రామగుండం ప్రీమియర్ లీగ్ నుండే క్రీడాకారులు తయారు కావాలని* అందరికీ బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నానని మాట్లాడడం జరిగినది. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్లతోపాటు,ఆర్పీఎల్ నిర్వహకులు, యూత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

షాప్ చైర్మన్ గా ఉన్న సమయంలోనే క్రీడారంగానికి విశేషమైన సేవలందించిన నాయకులు మన ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్, యువత చెడు త్రోవ పట్టకుండా క్రీడాకారుల నైపుణ్యాన్ని గుర్తిస్తూ టోర్నమెంట్ ఏర్పాటు చేసిన Rpl నిర్వాహకులకు అభినందనలు – నగర మేయర్ మహంకాళి స్వామి

క్రీడలను నిరంతరం ప్రోత్సహించే నాయకుడు మన గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్, క్రీడాకారులు జయాప జయాలతో సంబంధం లేకుండా ఒక్కటిగా ముందుకు సాగాలి-మనాలి ఠాగూర్

Related Articles

Most Popular