Sunday, April 12, 2026

రామగుండం కార్పొరేషన్ ని ఫ్రీ కరప్షన్ కార్పొరేషన్ గా తీర్చిదిద్దుతాము :నగర మేయర్ మహంకాళి స్వామి

MS8NEWS గోదావరిఖని ఫిబ్రవరి 23 : 38వ డివిజన్ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా మల్లికార్జున్ నగర్ ప్రజల దీర్ఘకాలిక ఆకాంక్ష బస్తీ కమాన్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి అధ్యక్ష ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ ఠాగూర్ సతీమణి, మక్కాన్సింగ్ సేవా సమితి చైర్మన్ మనాలి , మేయర్ మహంకాళి స్వామి ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అతిధులుగా బొంతల రాజేష్ కార్పొరేషన్ అధ్యక్షులు, కార్పొరేటర్లు దాసరి విజయ్, కన్నూరి శంకర్, దాసరి సాంబమూర్తి, దూళికట్ట సతీష్, రాజిరెడ్డి యుగేందర్ లు పాల్గొన్నారు. మల్లికార్జున నగర్ కమాన్ ప్రారంభోత్సవ అనంతరం మనాలి టాగూర్ మాట్లాడుతూ బస్తిలో ఉన్న ప్రతి సమస్యను కార్పొరేటర్ నెల కంటి రాము దృష్టికి తీసుకురావాలని తక్షణమే వాటికి పరిష్కార దిశగా చర్యలు చేపడుతామని పేర్కొన్నారు. మేయర్ మహంకాళి స్వామి మాట్లాడుతూ రామగుండం కార్పొరేషన్ ని ఫ్రీ కరప్షన్ కార్పొరేషన్ గా తీర్చిదిద్దుతానని వాక్యానించారు. సమస్యలు ఉంటే నేరుగా మీ కార్పొరేటర్ ను గాని మున్సిపల్ ఆఫీసులో గాని సంప్రదించాలని అంతేగాని ఏజెంట్లను సంప్రదించకూడదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బస్తీ సభ్యులు పంజాల ఆంజనేయులు కోటరాజు శనగరపు మల్లేష్, ch. నారాయణ, పెట్టం రాములు అల్లం కిరణ్ కుమార్ అల్లం అన్వేష్, చీకురు మల్లి రాజు కుమార్, నేరెళ్ల రాజ్ కుమార్ మొండయ్య, సింహాచలం, కవ్వంపల్లి కనకలక్ష్మి, బుర్ర కనక లక్ష్మి, వాణి తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Most Popular