Sunday, April 12, 2026

మానవత్వం మరిచి పసికందును చంపిన దుర్మార్గులను ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపి ఉరిశిక్ష విధించాలి —- రజక సంఘం పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్

నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలో జరుగుతున్న మల్లికార్జున స్వామి కళ్యాణం ఉత్సవంలో భాగంగా దైవదర్శనానికి వచ్చిన రజక కుటుంబాన్ని విచక్షణ రహితంగా కొట్టి రెండు నెలల పసికందును మానవత్వం మరిచి చంపిన అగ్రకుల అహంకార దుర్మార్గపు చర్యను ఖండిస్తూ

రజక సంఘం అధ్యక్షులు బండి లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన నిరసన కార్యక్రమానికి హాజరైన పెద్దపల్లి జిల్లా రజక సంఘం అధ్యక్షులు పెండ్యాల మహేష్ నల్ల బ్యాడ్జీలు ధరించి చాకలి ఐలమ్మ సర్కిల్ వద్ద నిరసన వ్యక్తం చేసిన అనంతరం మాట్లాడుతూ నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలో జరిగిన మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవంలో భాగంగా దైవదర్శనానికి వచ్చిన రజక కుటుంబం పై కుల వివక్షత చూపుతూ విచక్షణారహితంగా ఆ కుటుంబాన్ని కొట్టి గుళ్లో నుంచి నెట్టేసి అవమానించడమే కాకుండా ఆడబిడ్డ చేతిలో ఉన్న రెండు నెలల పసికందును కనీసం పాలు మరవని లోకం తెలవని పసిబిడ్డ అని కూడా ఆలోచించకుండా మానవత్వం మరిచి అగ్రకులా అహంకారంతో దుర్మార్గంగా కాలుతో తన్ని చంపిన దుర్మార్గులను వెంటనే అరెస్ట్ చేసి ఫాస్ట్ ట్రాక్కోర్టు ద్వారా విచారణ జరిపి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు

ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా రజక సంఘం జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్ కార్పొరేషన్ అధ్యక్షులు బండి లక్ష్మణ్ రజక సంఘం నాయకులు దావనపల్లి ఐఎఫ్టియు రాజేశం నారాయణ పడ్లూరి దేవయ్య వేదిరి కొండయ్య రమేష్ వైనాల సతీష్ జనగాం శివ ఎల్ఐసి కృష్ణ రవి శంకర్ మామిడి కుమార్ మామిడి మహేందర్ కరాటే శంకర్ ముఖ్యర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

Related Articles

Most Popular