MS8NEWS ఫిబ్రవరి 21 : రామగుండంలోని శ్రీ చైతన్య హైస్కూల్ ఎన్టిపిసి మరియు ఆర్.ఎఫ్.సి.ఎల్ 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులకు “విజ్ క్లబ్ జోనల్ లెవెల్ కాంపిటీషన్ ప్రోగ్రాం” నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా విద్యార్థిని విద్యార్థులు రోబోటిక్ కోడింగ్ & ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ప్రాజెక్ట్స్ తయారు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్.ఎఫ్.సి.ఎల్ ప్లాంట్ నుండి శ్రీ.ఎస్.కె జిందాల్(యూనిట్ హెడ్) మరియు ఎస్.ఎన్ సాహు (డిజిఎం ప్రొడక్షన్) పాల్గొని ప్రాజెక్ట్స్ గురించి విద్యార్థులను ఆసక్తిగా అడిగి తెలుసుకుని అభినందించారు. గెలుపొందిన వారికి మెమంటోలు మెడల్స్ అందించారు. ఈ కార్యక్రమం లో సురేంద్ర పరిహార్ (విజ్ క్లబ్ ఆల్ ఇండియా ప్రోడక్ట్ హెడ్), సందీప్ కుమార్(ఏ.పీ, టీ.జి స్టేట్ హెడ్) మాట్లాడుతూ విద్యార్థి దశనుండే ఇలాంటి ప్రాజెక్ట్స్ చేయడం వల్ల భవిష్యతు లో దేశానికే మార్గదర్శకం గా నిలుస్తారు అని చెప్పారు. పాఠశాల ప్రిన్సిపల్స్ ఉదయ్ కుమార్, రవి విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమం లో అధ్యాపకులు, తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

