రామగుండం MS8NEWS:రామగుండం నగరపాలక సంస్థ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు అధికార యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. గోదావరిఖని (GDK) లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వేదికగా ఈ కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది.
రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభం
ఎన్నికల ఫలితాల కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, శుక్రవారం ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.
స్ట్రాంగ్ రూముల్లో 544 బ్యాలెట్ బాక్సులు
మొత్తం 59 డివిజన్లకు సంబంధించిన ఓట్ల లెక్కింపు జరగనుంది. 272 పోలింగ్ కేంద్రాల నుంచి సేకరించిన 544 బ్యాలెట్ బాక్సులను ఇప్పటికే స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు. కౌంటింగ్ కేంద్రం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ప్రత్యేక టేబుళ్ల ఏర్పాటు : ఫలితాలను త్వరితగతిన మరియు పారదర్శకంగా వెల్లడించేందుకు డివిజన్ల వారీగా ప్రత్యేక టేబుళ్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.

