Wednesday, February 11, 2026

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తేనే మన డివిజన్లకు సమగ్ర అభివృద్ధి – ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్

 

MS8NEWS ఫిబ్రవరి 8 గోదావరిఖని: మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇందిరా నగర్ 46, 47, 58వ డివిజన్లు, స్వతంత్ర చౌక్ 51వ డివిజన్, పాత మున్సిపల్ ఆఫీస్ పరిధిలోని 60వ డివిజన్ ప్రజలతో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో రామగుండం ఎమ్మెల్యే శ్రీ మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లను గెలిపిస్తేనే డివిజన్లలో సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేసి అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు.

  • రోడ్డు వెడల్పు చేస్తామని జరుగుతున్న తప్పుడు ప్రచారాలను ఆయన ఖండించారు.

కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పేదలకు నిజమైన న్యాయం జరుగుతుందని తెలిపారు. ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందిస్తామని, ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇంటి స్థలం ఇచ్చి, ఇల్లు నిర్మించుకునేందుకు రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. స్థలం ఉండి ఇల్లు లేని వారికి కూడా రూ.5 లక్షల సహాయం అందిస్తామని చెప్పారు.ఈ నెల 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు ప్రజలకు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు మరియు ఆయా డివిజన్ల ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు.

Related Articles

Most Popular