Monday, April 13, 2026

తెలంగాణ పురపోరు.. నామినేషన్ల ఉపసంహరణకు (ఫిబ్రవరి 3న)ఈ రోజు లాస్ట్ ఛాన్స్

 

MS8NEWS ఫిబ్రవరి 3 హైదరాబాద్: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నగారా మోగుతుండగా, కీలకమైన నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ నేటితో (ఫిబ్రవరి 3, మంగళవారం) ముగియనుంది. రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థుల తుది జాబితా ఖరారు కావడానికి సమయం ఆసన్నమైంది.రాష్ట్రంలోని పురపాలక సంఘాల్లో పోటీ తీవ్రంగా ఉంది. అధికారుల గణాంకాల ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి:

మొత్తం మున్సిపాలిటీలు: 116

మున్సిపల్ కార్పొరేషన్లు: 7

మొత్తం వార్డులు: 2,996

దాఖలైన నామినేషన్ సెట్లు: 29,694

అర్హత సాధించిన అభ్యర్థులు: 19,608

ముగియనున్న సమయం : పోటీ నుంచి తప్పుకోవాలనుకునే అభ్యర్థులు నేడు మధ్యాహ్నం 3 గంటల వరకు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత, ఎన్నికల అధికారులు పోటీలో నిలిచే అభ్యర్థుల తుది జాబితాను (Final List) అధికారికంగా వెల్లడిస్తారు. ఈ జాబితా ఆధారంగానే బ్యాలెట్ పేపర్ల తయారీ, గుర్తు కేటాయింపు ప్రక్రియలు వేగవంతం కానున్నాయి.

రాజకీయ వ్యూహాలు :రెబల్ అభ్యర్థులను బుజ్జగించేందుకు ప్రధాన పార్టీలు చివరి నిమిషం వరకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. మధ్యాహ్నం లోపు ఎంతమంది వెనక్కి తగ్గుతారనే దానిపై గెలుపోటముల సమీకరణాలు మారే అవకాశం ఉంది.

Related Articles

Most Popular