MS8NEWS గోదావరిఖని, ఫిబ్రవరి 02: రాబోయే మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పోలీసు యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉండాలని పెద్దపల్లి డీసీపీ బి. రామ్ రెడ్డి ఆదేశించారు. సోమవారం ఆయన గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్‌తో కలిసి గోదావరిఖని 1-టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిసరాలు, రికార్డులు మరియు రిసెప్షన్ సెంటర్‌ను తనిఖీ చేశారు.
బాధితులకు భరోసా కల్పించాలి:స్టేషన్‌కు వచ్చే బాధితుల పట్ల పోలీసులు మర్యాదగా వ్యవహరించాలని, వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించి పోలీసు వ్యవస్థపై నమ్మకం కలిగించాలని డీసీపీ సూచించారు. సెక్టార్ల వారీగా ఎస్ఐలు నిర్వహిస్తున్న విధులు, రౌడీ షీటర్లు, అనుమానితులు మరియు ట్రబుల్ మాంగర్ల ప్రస్తుత కదలికలపై ఆరా తీశారుమున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో డీసీపీ అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు
ముందస్తు చర్యలు: లా అండ్ ఆర్డర్‌కు విఘాతం కలగకుండా సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచాలి.
నియమావళి అమలు: ఎన్నికల కోడ్ ఉల్లంఘించే వారిపై, ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.ప్రచారం నుండి పోలింగ్ ముగిసే వరకు సిబ్బంది అందరూ సమన్వయంతో పనిచేస్తూ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలి.
ఈ కార్యక్రమంలో గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్, సీఐ ఇంద్రసేన రెడ్డి, ఎస్ఐలు రమేష్, మనోహర్, అనూష తదితరులు పాల్గొన్నారు.

