MS8NEWS జనవరి 26:రామగుండం కార్పొరేషన్ పరిధి లో గోదావరిఖని చౌరస్తాకు చెందిన మేకల రవి సుమన్ s/o మేకల(రేడియం) శ్రీనివాస్ కుమారుడు పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీలో బిఏ హానర్స్ ఇన్ మాస్ మీడియా కమ్యూనికేషన్ లో విద్యనభ్యసిస్తున్నారు.విద్యలో భాగమైన ల్యాప్ టాప్ అవసరం ఉండగా తన చదువులో ల్యాప్ టాప్ లేక ఇబ్బందులు పడుతున్నారని, విషయం తెలుసుకున్న రామగుండము నియోజకవర్గం బి.ఆర్.ఎస్ రాష్ట్ర నాయకులు, వ్యాల్ల హరీష్ రెడ్డి సోమవారం హైదరాబాదులోని తెలంగాణ భవన్ లో రవి సుమన్ కు BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ. రామారావు చేతులమీదగా ల్యాప్ టాప్ అందజేశారు.
ఈ ప్రాంతానికి ఆదర్శంగా నిలువాలని.. ఇలాంటి పేదవారిని ఉన్నతంగా తీర్చిదిద్దడంలో అవసరమైన సహాయ సహకారాలు అందించాలని హరీష్ రెడ్డికి సూచించారు. రవి సుమన్ కుటుంబ సభ్యులు హరీష్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ కోఆప్షన్ మెంబర్ తస్నిం బాను, Brs పార్టీ నియోజకవర్గ అధికార ప్రతినిధి జాహిద్ పాషా, యువజన విభాగం అధికార ప్రతినిధి బూరుగు వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

