Monday, April 13, 2026

రామగుండంలో రాజకీయ అరుదైన దృశ్యం: ఒకే వేదికపై మూడు పార్టీలు!

 

MS8NEWS జనవరి 26 గోదావరిఖని : ఎన్నికల నగారా మోగడంతో రామగుండం నియోజకవర్గంలో రాజకీయ సెగలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. పార్టీల మధ్య పోటాపోటీ ప్రచారాలు, సవాళ్లు, ప్రతిసవాళ్లతో వాతావరణం వేడెక్కుతున్న తరుణంలో.. స్థానిక 9వ డివిజన్ విద్యానగర్‌లో చోటుచేసుకున్న ఒక సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేయడమే కాకుండా, చర్చనీయాంశంగా మారింది.

సాధారణంగా ఒక పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి మరో పార్టీ నాయకులు రావడం అరుదు. కానీ, ఇక్కడ విద్యానగర్‌లోని యూత్ ఆఫీస్ వద్ద జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్, బిఆర్ఎస్, మరియు బిజెపి పార్టీల నాయకులు పంతాలు పక్కన పెట్టి ఒకే వేదికను పంచుకున్నారు.

ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిదర్శనం: వివిధ సిద్ధాంతాలు కలిగిన ఈ ప్రధాన పార్టీల నాయకులు కలిసి జెండా ఆవిష్కరణలో పాల్గొనడం చూసి స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులతో పాటు బస్తీ పెద్దమనుషులు, యువత భారీ సంఖ్యలో పాల్గొన్నారు. రాజకీయాలు ఎన్నికల వరకే అని, బస్తీ అభివృద్ధి మరియు ఐక్యత విషయంలో అందరం ఒక్కటే అని ఈ సందర్భంగా నాయకులు చాటిచెప్పారు.

Related Articles

Most Popular