Monday, April 13, 2026

​రామగుండం ఇంచార్జీ కమిషనర్‌ను వెంటనే బదిలీ చేయాలి ​రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ‘ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ’ విజ్ఞప్తి ​అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారని మద్దెల దినేష్ ఆరోపణ

 

MS8NEWS రామగుండం, జనవరి 23 :రామగుండం నగర పాలక సంస్థ ఇంచార్జీ కమిషనర్ మరియు పెద్దపల్లి జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ను తక్షణమే బదిలీ చేయాలని ‘ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ’ అధ్యక్షులు మద్దెల దినేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి లేఖ రాశారు. శుక్రవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఆయన కమిషనర్ వ్యవహారశైలిపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

​నిధుల అవకతవకలపై ఆరోపణలు :2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించిన సదరు అధికారి, పోలింగ్ బూత్‌లలో సౌకర్యాల కల్పన కోసం కేటాయించిన నిధుల్లో అవకతవకలకు పాల్పడ్డారని దినేష్ ఆరోపించారు. పనులు చేసిన కాంట్రాక్టర్లకు ఇప్పటికీ బిల్లులు అందలేదని, నిధులు మాయమయ్యాయని ఆయన పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల్లోనూ ఏఆర్వోగా ఉండి ఇదే తీరుగా వ్యవహరించారని విమర్శించారు.రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కమిషనర్ల బదిలీలకు ఒక నిబంధన ఉంటే, రామగుండం కమిషనర్‌కు మాత్రం మరో నిబంధన ఉందా? అని ఆయన ప్రశ్నించారు. మున్సిపల్ కమిషనర్లుగా వచ్చేవారిపై ఒత్తిడి తెచ్చి, వారు బదిలీ అయ్యేలా చేసి ఇంచార్జీ బాధ్యతలు చేపట్టారని ఆరోపించారు.ప్రజా సమస్యలు పక్కన పెట్టి కేవలం అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులకు, స్థానిక ఎమ్మెల్యేకు అనుకూలంగా పనిచేస్తున్నారని విమర్శించారు. కార్పొరేషన్ సిబ్బందిని, కార్మికులను మానసిక వేధింపులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు.

​ఎన్నికల నేపథ్యంలో ఆందోళన:త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా, ఆమె అదే పదవిలో కొనసాగితే ఎన్నికల నిష్పాక్షికత దెబ్బతింటుందని దినేష్ ఆందోళన వ్యక్తం చేశారు.​”డివిజన్ల పునర్విభజన మరియు ఓటర్ల జాబితా తయారీలో కేవలం అధికార పార్టీ నేతలు చెప్పినట్లుగా వ్యవహరించారు. క్షేత్రస్థాయిలో పర్యటించకుండా కార్యాలయంలో కూర్చుని తప్పుల తడకగా జాబితాను రూపొందించారు” అని ఆయన దుయ్యబట్టారు.

​జిల్లాలో రెండేళ్లు పూర్తి చేసుకున్నప్పటికీ, అధికార పార్టీ అండదండలతోనే ఆమె కొనసాగుతున్నారని, ఆమెను వెంటనే బదిలీ చేస్తేనే స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా జరుగుతాయని ఆయన ఎన్నికల సంఘాన్ని మరియు జిల్లా కలెక్టర్‌ను కోరారు.

Related Articles

Most Popular