Monday, April 13, 2026

​మునుగోడులో ‘కోమటిరెడ్డి’ అనుచరుల హుకుం: వైన్ షాపులపై దాడులు!

MS8NEWS మునుగోడు, జనవరి 23: మునుగోడు నియోజకవర్గంలో వైన్ షాపుల పనివేళలపై మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుచరులు తమదైన శైలిలో “హుకుం” జారీ చేయడం సంచలనంగా మారింది. తమ నాయకుడు చెప్పిన సమయానికే షాపులు తెరవాలని, లేనిపక్షంలో ఊరుకునేది లేదని వారు హెచ్చరిస్తున్నారు.రాజగోపాల్ రెడ్డి అనుచరుల డిమాండ్ ప్రకారం నియోజకవర్గంలో మద్యం దుకాణాల వేళలు ఈ క్రింది విధంగా ఉండాలని వారు షరతు విధిస్తున్నారు:

​వైన్ షాపులు: మధ్యాహ్నం 1 గంటకు మాత్రమే తెరవాలి.​పర్మిట్ రూమ్‌లు: సాయంత్రం 6 గంటల తర్వాతే అనుమతించాలి.ఈ నిబంధనలను అతిక్రమిస్తే షాపులను శాశ్వతంగా మూసివేయిస్తామని వారు హెచ్చరిస్తూ వీరంగం సృష్టిస్తున్నారు.

నారాయణపూర్‌లో ఉద్రిక్తత:సంస్థాన్ నారాయణపూర్‌లో ఈ వివాదం ముదిరింది. ఉదయాన్నే తెరిచి ఉన్న ఒక వైన్ షాపుపై కోమటిరెడ్డి అనుచరులు దాడికి తెగబడ్డారు. నిర్వాహకులతో వాగ్వాదానికి దిగి, వారిపై భౌతిక దాడి చేసి బలవంతంగా షాపును మూసివేయించారు. ఈ ఘటనతో స్థానిక వ్యాపారుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.​తమపై దాడి చేసి, వ్యాపారానికి ఆటంకం కలిగించిన రాజగోపాల్ రెడ్డి అనుచరులపై వైన్ షాపు నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నియోజకవర్గంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Related Articles

Most Popular