MS8NEWS గోదావరిఖని, జనవరి 22:రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారికి కోర్టు కఠిన శిక్షలు ఖరారు చేసింది. రామగుండం ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ బి. రాజేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ఐదుగురు వ్యక్తులు పట్టుబడ్డారు.
కోర్టు తీర్పు వివరాలు:పట్టుబడిన నిందితులను గోదావరిఖని సెకండ్ అడిషనల్ మేజిస్ట్రేట్ శ్రీ వెంకటేష్ దుర్వ గారి ఎదుట హాజరుపరిచారు. కేసును విచారించిన న్యాయమూర్తి ఈ క్రింది విధంగా తీర్పునిచ్చారు. నలుగురు వ్యక్తులకు ఒక్కొక్కరికి ₹8,000 చొప్పున జరిమానా విధించారు.
జైలు శిక్ష: ఒక వ్యక్తి గతంలోనూ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడి, ఇప్పుడు రెండవసారి కూడా అదే నేరానికి పాల్పడటంతో అతనికి 03 రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు.శిక్ష పడిన వ్యక్తిని వెంటనే కరీంనగర్ జిల్లా జైలుకు తరలించినట్లు ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ రాజేశ్వరరావు తెలిపారు.
హెచ్చరిక: మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లుతుందని, పదే పదే తప్పు చేస్తే జైలు శిక్ష తప్పదని ఈ సందర్భంగా పోలీసులు వాహనదారులను హెచ్చరించారు.

