Monday, April 13, 2026

​ప్రజాసేవే లక్ష్యం.. అభివృద్ధికి పట్టం కట్టండి: పిడుగు కృష్ణ ముదిరాజ్

MS8NEWS జనవరి 18:రామగుండం: రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 10వ డివిజన్ (సీతారాం నగర్) అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి నిరంతరం కృషి చేసే తనను మరోసారి ఆశీర్వదించాలని భారతీయ జనతా పార్టీ (BJP) కార్పొరేటర్ అభ్యర్థి, మాజీ కార్పొరేటర్ పిడుగు కృష్ణ ముదిరాజ్ ఓటర్లను అభ్యర్థించారు. ఆదివారం ఆయన తన డివిజన్ పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ప్రజలతో మమేకమయ్యారు.

గత ఐదేళ్ల అభివృద్ధి – కళ్లముందే సాక్ష్యం:

​తాను పదవిలో ఉన్న సమయంలో సీతారాం నగర్ రూపురేఖలు మార్చానని ఆయన గుర్తు చేశారు. ముఖ్యంగా:అండర్ గ్రౌండ్ డ్రైనేజీ: సుమారు 20 లక్షల రూపాయల నిధులతో అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థను చక్కదిద్ది, పెద్ద పైప్‌లైన్ల ద్వారా మురుగు నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించినట్లు తెలిపారు.

మౌలిక సదుపాయాలు: ప్రతి గల్లీలో సిమెంట్ రోడ్లు, ఇంటింటికీ మంచి నీటి నల్లాలు ఏర్పాటు చేశామని.. ఉర్దూ మీడియం స్కూల్, వినాయక మండపం, రామాలయం వద్ద నూతనంగా బోర్లు వేయించినట్లు వివరించారు.

మహిళా సాధికారత: మహిళా సంఘాల సమావేశాల కోసం ప్రత్యేకంగా మహిళా గ్రూప్ బిల్డింగ్ నిర్మించామని పేర్కొన్నారు.

సామాజిక భద్రత: అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు, వికలాంగులు, వితంతువులు మరియు వృద్ధులకు పింఛన్లు అందేలా కృషి చేశానని తెలిపారు.

పోరాటాల నేపథ్యం – స్వచ్ఛమైన రాజకీయం:

​తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని, 17 రోజుల పాటు జైలు జీవితం గడిపిన చరిత్ర తనదని కృష్ణ ముదిరాజ్ గుర్తు చేశారు. గత 30 ఏళ్లుగా నిస్వార్థంగా ప్రజా సమస్యలపై పోరాడుతున్నానని, ప్రత్యర్థులు ఎన్ని దాడులు చేసినా భయపడకుండా ప్రజల పక్షానే నిలబడ్డానని అన్నారు.

​”వార్డు ప్రజలపై ఎన్నడూ రౌడీయిజం చేయలేదు, అందరినీ తోబుట్టువుల్లా భావించాను. నా మంచితనం, నా పనితీరుపై నాకు నమ్మకం ఉంది.” అని ఆయన వ్యాఖ్యానించారు.

ఓటరు దేవుళ్లకు విన్నపం:

​ప్రజల మధ్యే ఉంటూ, వారి కష్టసుఖాల్లో పాలుపంచుకునే తనను కమలం గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. తనను గెలిపిస్తే మరిన్ని నిధులు తెచ్చి డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు.

Related Articles

Most Popular