MS8NEWS జనవరి 18 : రామగుండం కార్పొరేషన్ 7వ డివిజన్‌ను ఆదర్శవంతమైన డివిజన్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా, ప్రజా సేవలో నిరంతరం నిమగ్నమై ఉన్న బొంతల రాగిణి భాను ప్రసాద్ రాబోయే కార్పొరేషన్ ఎన్నికల బరిలో నిలవనున్నారు. అభివృద్ధి అంటే కేవలం రోడ్లు వేయడమే కాదు, ప్రతి ఇంటి సమస్యను తన సొంత సమస్యగా భావించి పరిష్కరించడమే నిజమైన అభివృద్ధి అని వారు పేర్కొన్నారు.
ఏళ్ల తరబడి పీడిస్తున్న డ్రైనేజీ మరియు తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే ప్రథమ ప్రాధాన్యత.తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి గడపకూ అందేలా చూడటం.అందుబాటులో ఉండే నాయకత్వం: కార్యకర్తలకు, ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటూ డివిజన్ సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయడం.
ప్రజలకు విజ్ఞప్తి:”మీరు నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా, మీ ఇంట్లో మనిషిలా, మీ సేవకుడిగా పని చేస్తాను. రాబోయే ఎన్నికల్లో BRS పార్టీ అభ్యర్థిగా నన్ను ఆశీర్వదించి, మీ అమూల్యమైన మద్దతును తెలపవలసిందిగా విన్నవించుకుంటున్నాను.”అనీ బొంతల రాగిణి భాను ప్రసాద్ తెలిపారు.

