MS8NEWS జనవరి 17 హైదరాబాద్: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగగా గుర్తింపు పొందిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ప్రసాదాన్ని భక్తుల ఇంటి వద్దకే చేర్చేందుకు టీజీఎస్ ఆర్టీసీ లాజిస్టిక్స్ విభాగం సిద్ధమైంది. రద్దీ కారణంగా లేదా ఇతర కారణాలతో జాతరకు వెళ్లలేకపోయే భక్తుల కోసం దేవాదాయ శాఖ సహకారంతో ఈ ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆర్టీసీ ఎండీ వై. నాగిరెడ్డి తెలిపారు.
జనవరి 28 నుండి 31 వరకు (ములుగు జిల్లా).సేవా రుసుము: కేవలం రూ. 299/- మాత్రమే.
ప్రసాదం కిట్‌లో ఏముంటాయి?: అమ్మవార్ల ప్రసాదం, పవిత్ర చిత్రం (Photo), పసుపు, కుంకుమ మరియు బంగారం (బెల్లం).
బుకింగ్ ఎలా చేసుకోవాలి?
భక్తులు ఈ సేవలను పొందేందుకు రెండు మార్గాలు అందుబాటులో ఉన్నాయి:ఆన్‌లైన్: www.tgsrtclogistics.co.in వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.మీకు సమీపంలో ఉన్న టీజీఎస్ ఆర్టీసీ లాజిస్టిక్స్ కౌంటర్లలో నేరుగా సంప్రదించవచ్చు.
సహాయం కోసం సంప్రదించండి:
వివరాల కోసం లేదా సందేహాల నివృత్తి కోసం ఈ క్రింది కాల్ సెంటర్ నంబర్లకు ఫోన్ చేయవచ్చు:
040-69440069, 040-23450033
“మేడారం వెళ్లలేని భక్తుల మనోభావాలను గౌరవిస్తూ, అమ్మవార్ల ఆశీస్సులు ప్రతి ఇంటికి చేరాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. భక్తులందరూ ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి” అని ఆర్టీసీ యాజమాన్యం కోరింది.

