Monday, April 13, 2026

రామగుండం అభివృద్ధికి బాటలు: 8వ కాలనీలో రూ. 30 లక్షలతో డైలీ మార్కెట్ ప్రారంభం

MS8NEWS ​రామగుండం, జనవరి 17: రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 8వ కాలనీలో నూతనంగా నిర్మించిన డైలీ మార్కెట్ యార్డ్‌ను రామగుండం శాసనసభ్యులు మఖాన్ సింగ్ రాజ్ ఠాకూర్  శనివారం ఘనంగా ప్రారంభించారు. సుమారు 30 లక్షల రూపాయల వ్యయంతో అత్యాధునిక సౌకర్యాలతో ఈ మార్కెట్ యార్డ్‌ను ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వసతులు కల్పించడమే తమ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. 8వ కాలనీ ప్రజల చిరకాల కోరికైన డైలీ మార్కెట్‌ను అందుబాటులోకి తీసుకురావడం సంతోషంగా ఉందని, దీనివల్ల అటు వ్యాపారులకు, ఇటు వినియోగదారులకు ఎంతో లబ్ధి చేకూరుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.​ఈ ప్రారంభోత్సవ వేడుకలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు సీనియర్ నాయకులు మరియు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు,​స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి మార్కెట్ యార్డ్ ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేశారు. ఎమ్మెల్యే మఖాన్ సింగ్ రాజ్ ఠాకూర్  మార్కెట్ ప్రాంగణాన్ని కలియతిరిగి, అక్కడ కల్పించిన సౌకర్యాలను పరిశీలించారు.

Related Articles

Most Popular