Monday, April 13, 2026

​సింగరేణి కార్మికుల పక్షపాతి ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ​* జీడీకే 2 ఇంక్లైన్ గనిపై అపూర్వ స్వాగతం పలికిన కార్మిక వర్గం ​* డిపెండెంట్ ఉద్యోగాలు, విజిలెన్స్ కేసుల పరిష్కారానికి హామీ ​* సింగరేణి నిధులు ఇకపై ఈ ప్రాంతాభిద్ధికే..

MS8NEWS ​రామగుండం (ఏరియా-1), జనవరి 17:సింగరేణి గని కార్మికుల సమస్యల పరిష్కారమే తన ధ్యేయమని, అసెంబ్లీలో కార్మికుడి గొంతుకనై ప్రతిసారి వారి గోడును వినిపిస్తున్నానని రామగుండం శాసనసభ్యులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. శనివారం రామగుండం ఏరియా-1 పరిధిలోని జీడీకే 2 ఇంక్లైన్ గనిపై రాజ్ ఠాకూర్ టీం నాయకులు కత్రోజ్ మోహన్ బాబు, సాయికుమార్, భాస్కర్ల కిరణ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘గని కార్మికుల ఆత్మీయ పలకరింపు’ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఘన స్వాగతం.. బైక్ ర్యాలీ:ముందుగా 2A గని ఉద్యోగులు మోరి నుండి భారీ బైక్ ర్యాలీతో ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. గని వద్దకు చేరుకోగానే కార్మికులు బాణాసంచా పేల్చుతూ, డీజే పాటలు, కోలాటాల మధ్య జననీరాజనం పలికారు. అనంతరం ఏరియా జీఎం లలిత్ కుమార్ గారు తన అధికార బృందంతో ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గనిపై ఉన్న అమ్మవారి దేవాలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కార్మికుడి రూపంలో అసెంబ్లీకి: “మీరు నన్ను గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే, నేను అక్కడ ఎమ్మెల్యేగా కాదు, మీ ప్రతినిధిగా, ఒక కార్మికుడి రూపంలో మీ ఋణం తీర్చుకుంటున్నాను. ఇప్పటి వరకు 27 సార్లు అసెంబ్లీలో మాట్లాడే అవకాశం వస్తే, ప్రతిసారీ సింగరేణి సమస్యలనే ప్రస్తావించాను.” డిపెండెంట్ ఉద్యోగాలను ఖచ్చితంగా కొనసాగిస్తామని, మారుపేర్ల సమస్యలు, విజిలెన్స్ కేసులకు త్వరలోనే శాశ్వత పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వాలు సింగరేణి నిధులను సిద్దిపేట, సిరిసిల్ల వంటి ప్రాంతాలకు తరలించాయని, కానీ ఇప్పుడు ఆ నిధులను ఇక్కడే ఖర్చు పెట్టి రామగుండాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నామని పేర్కొన్నారు.

వైద్య సదుపాయం: కార్మికుల ఆరోగ్య దృష్ట్యా వచ్చే 60 రోజుల్లో ‘క్యాథ్ ల్యాబ్’ (Cath Lab) ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.ఇకపై ప్రతి గనిపై యూనియన్లకు అతీతంగా ‘రాజ్ ఠాకూర్ టీం’ కార్మికులకు అండగా ఉంటుందని, ప్రతి కార్మికుడి సమస్యను తన దృష్టికి తీసుకువస్తుందని తెలిపారు. సభ అనంతరం ఎమ్మెల్యే గని క్యాంటీన్‌లో కార్మికులతో కలిసి అల్పాహారం చేస్తూ, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.​ఈ కార్యక్రమంలో రాజ్ ఠాకూర్ టీం సభ్యులు సింగరేణి శ్రీనన్న, జనగామ శ్రీనివాస్, అరగంటి కృష్ణ, రసమళ్ళ కిరణ్, అధికారులతో పాటు పెద్ద సంఖ్యలో కార్మికులు, మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.

https://www.instagram.com/reel/DTmc4IVkh7W/?igsh=c2lidzF0b3l3ejZ4

Related Articles

Most Popular